newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

లూలూను సాగనంపలేదు.. భూములను రద్దు చేశామంతే: మేకపాటి వివరణ

22-11-201922-11-2019 14:54:27 IST
2019-11-22T09:24:27.548Z22-11-2019 2019-11-22T09:24:25.582Z - - 05-08-2020

లూలూను సాగనంపలేదు.. భూములను రద్దు చేశామంతే: మేకపాటి వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత అయిదునెలల్లో ఏపీనుంచి ఒక్క పరిశ్రమ కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించికపోయినా, కొత్త పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులకోసం సిద్ధంగా ఉంటూ నిత్యం తనను సంప్రదిస్తున్నా లూలూ గ్రూప్‌తో ఒప్పందం రద్దు చేసిన ఘటనను పునస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతికూల మీడియా అబద్ధాలు, కట్టుకథలు అల్లి వార్తలను ప్రచురించడంలో మునిగిపోయిందని పరిశ్రమలు, ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వం రిలయన్స్, లులూ గ్రూపులకు వివాదాస్పద భూములు కేటాయించడంతో వాటిని రద్దు చేసి న్యాయపరమైన చిక్కులు లేని భూములను కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గతంలో కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ గ్రూపు ఆసక్తి చూపించిందని వెల్లడించారు. నెలకు రూ.50 కోట్ల అద్దె ఆదాయం వచ్చే 13.83 ఎకరాల భూమిని గత ప్రభుత్వం లులూ గ్రూపునకు కేవలం రూ.7.09 కోట్లకే కేటాయించడంతో ఏటా సుమారు రూ.500 కోట్లు నష్టం వాటిల్లుతోందన్నారు.

అందుకే లూలూగ్రూప్‌కు గత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు మాత్రమే రద్దు చేశామని, ప్రభుత్వంతో ఆ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. లులూ గ్రూపు రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. బయట ప్రచారంలో ఉన్న కాగితంపై కనీసం కంపెనీ లోగో, సంతకం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. 

గత ఐదు నెలల్లో రాష్ట్రం నుంచి ఒక్క కంపెనీ కూడా వెళ్లకపోయినా ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ సంస్థ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని చెప్పిందనే వార్తాల్లో ఏలాంటి వాస్తవం లేదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. 

గురువారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటుకు లూలూ  గ్రూప్ సంస్థకు విశాఖపట్నంలో 13.83 ఎకరాల భూమి కేటాయించిందని పేర్కొన్నారు. లూలూ సంస్థ సింగిల్‌ బీడ్‌ వేసినా.. అది నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా.. ప్రభుత్వం వారికే ఇచ్చిందని విమర్శించారు. సింగిల్‌ బిడ్‌ మాత్రమే రావడంతోపాటు ఆ భూమి ప్రైమ్‌ ఏరియాలో ఉండటం కూడా సంస్థను రద్దు చేయడానికి ఒక కారణమన్నారు. ఈ సంస్థకు కేటాయించిన భూములపై కేసులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 

ఇక ఆ ప్రాంతంలో రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారని, అయితే టీడీపీ చాలా తక్కువ రెంటల్‌ వాల్యూకు అక్కడి భూములను లూలూ సంస్థకు ఇచ్చారని వెల్లడించారు. లూలూ కంపెనీకి లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ ఇచ్చినా గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందని విమర్శించారు. అవినీతికి తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందు నుంచే చెబుతూ వస్తున్నారని, అందుకే రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ఆలోచనను నిరోధించామని తెలిపారు. ఏపీఐఐసీ దగ్గర కూడా గొప్ప టెక్నాలజీ ఉందని, గతంలో అనేక నిర్మాణాలను చేపట్టిందన్నారు. 

దాదాపు రూ.1000 కోట్లతో అనంతపురంలో విద్యుత్‌ బస్సుల నిర్మాణ సంస్థ వీరా వాహన ఉద్యోగ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. వీర వాహన యూనిట్‌కు 120 ఎకరాలు కేటాయించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా భారీ రాయితీలు కాకుండా విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.

ఆర్బిట్రేషన్‌ ప్రతి ఒక్కరి హక్కు. పీపీఏల విషయంలో ఆర్బిట్రేషన్‌కు వెళ్లడంలో తప్పు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తప్పు చేస్తే తాము ఎందుకు తప్పుచేయాలని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా కంపెనీలకు మౌలిక వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చే భూములలో పరిశ్రమల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని మంత్రి  భరోసా ఇచ్చారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle