newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

లిక్కర్ షాపులన్నీ ఏపీ ప్రభుత్వ స్వాధీనం.. డైలెమ్మాలో కేసీఆర్‌

29-09-201929-09-2019 12:13:56 IST
2019-09-29T06:43:56.908Z29-09-2019 2019-09-29T06:43:55.213Z - - 21-01-2020

లిక్కర్ షాపులన్నీ ఏపీ ప్రభుత్వ స్వాధీనం.. డైలెమ్మాలో కేసీఆర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను అక్టోబర్‌ 1 నుంచి స్వయంగా నిర్వహించనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఇంతవరకు 475 లిక్కర్ షాపులను స్వాధీనపర్చుకున్న ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి మొత్తం 3,500 లిక్కర్ షాపులను స్వయంగా నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి శనివారం ప్రకటించారు. క్రమంగా లిక్కర్ షాపులను కూడా ఎత్తివేయాలన్నది ప్రభుత్వ ప్లాన్.

ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై కొరడా ఝళిపించిన వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్వహిస్తున్న లిక్కర్ షాపులను కూడా 4,380 నుంచి 3,500లకు తగ్గిస్తామని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ 43,000 బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహించగా నూతనంగా అధికారం స్వీకరించిన వైఎస్ జగన్ వాటన్నింటినీ మూసివేయించారని చెప్పారు.

బెల్ట్ షాపులంటే లైసెన్స్ ఉన్న లిక్కర్ షాపుల యజమానులు నడుపుతున్న అక్రమ మద్యదుకాణాలని కొత్త ప్రభుత్వం భాష్యం చెబుతోంది. అక్రమ సారా, మద్యం తయారీని నిరోధించే ప్రక్రియలో భాగంగా ఇంతవరకు 4,788 కేసులు నమోదు చేయగా, 2,834 మందిని అరెస్టు చేశారు.

తాను అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధిస్తానని పాదయాత్ర సందర్భంగా హామీఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను మూసివేయడమే కాకుండా వైన్ షాపులను కూడా తానే నిర్వహిస్తానని చెప్పింది.

అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 వరకు తెరిచి ఉంటాయని మంత్రి తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా భావించిందని, ఇలా ఎక్కడ పడితే అక్కడ వెలిసిన బెల్టు షాపుల్లో మద్యం తాగి వ్యసనానికి బానిసలయిన వారికోసం తమ ప్రభుత్వం ప్రతి ఆసుపత్రిలోనూ డీ-ఎడిక్షన్ కేంద్రాలను తెలిచి చికిత్స చేయిస్తుందన్నారు.

కుటుంబాల్లో మగవాళ్లు మద్యపానం మితిమీరి సేవించడం ద్వారా లక్షలాది మహిళలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందుకే వారి కన్నీళ్లు తుడవడానికే బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయించామని మంత్రి చెప్పారు. లిక్కర్ షాపులమీదే ఆధారపడిన ఉద్యోగులకు వేరే రకంగా ఉపాధి కలిగిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

అయితే ఇలా బెల్టుషాపులను తగ్గించి మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించినా రాష్ట్రానికి మద్యపాన రాబడి 2000 కోట్లు అదనంగా రానుందని ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో కూడా చూపడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలెమ్మాలో పడ్డారని బోగట్టా.  అసలే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో డబ్బుకు కటకటగా ఉన్న తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్యనిషేధాలు తానే చేపడితే ప్రభుత్వం కాస్తయినా గట్టెక్కుతుందన్న ఆలోచన కేసీఆర్‌ని తొలుస్తోందని, త్వరలో టీఎస్ ప్రభుత్వం కూడా దీనిపై విధాన నిర్ణయం తీసుకోవచ్చని విశ్వసనీయ సమాచారం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle