newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

లాల్ - నీల్‌ను ఈజీగా వ‌దిలేశారే..!

15-01-202015-01-2020 08:38:27 IST
2020-01-15T03:08:27.215Z15-01-2020 2020-01-15T03:08:23.826Z - - 20-01-2020

లాల్ - నీల్‌ను ఈజీగా వ‌దిలేశారే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనూహ్య రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇక నుంచి భ‌విష్య‌త్ ఎన్నిక‌ల్లో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. ఈ మేర‌కు ఢిల్లీలో ప‌లువురు ఆర్ఎస్ఎస్ నేత‌లు, బీజేపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ జేపీ న‌డ్డాను క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌ర్చించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న బీజేపీలో క‌ల‌వ‌డం ఇంచుమించు ఖాయ‌మే.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యం జ‌న‌సేన క్యాడ‌ర్‌కు, బీజేపీకి అనూహ్య‌మే కానీ కొన్ని పార్టీల‌కు మాత్రం ఊహించ‌ని షాక్ అనే చెప్పుకోవాలి. ప‌వ‌న్ కళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నారు.

ఏదో ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకొని త‌మ ఉనికిని నిరూపించుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డే క‌మ్యూనిస్టు పార్టీలు గ‌త ఎన్నిక‌ల‌కు చాలా ముందునుంచే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌డిచాయి. ప‌వ‌న్ మార్చ్‌ల్లో పాదం క‌లిపాయి. ఇప్పుడు క‌మ్యూనిస్టుల‌ను వ‌దిలి పూర్తిగా భిన్న సిద్ధాంతాలు క‌లిగిన బీజేపీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్ల‌డం వారికి షాక్ లాంటిదే.

అయితే, క‌మ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే త‌న ఇమేజ్‌కు క‌మ్యూనిస్టుల ఓటు బ్యాంకు, ద‌ళిత ఓటు బ్యాంకు క‌లిసి వ‌స్తే ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌వ‌చ్చ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావించారు. ఇందుకోసం ఆయ‌న పొత్తుల‌కు వెళ్లారు. బీఎస్పీ విష‌యంలో ఆయ‌న మ‌రింత విన‌మ్రంగా వ్య‌వ‌హ‌రించారు. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని ఆకాంక్షించారు. ఆమెకు పాదాభివంద‌నం సైతం చేశారు. అయితే, ఎన్నిక‌ల త‌ర్వాత బీఎస్పీని, క‌మ్యూనిస్టుల‌ను ప‌వ‌న్ పూర్తిగా దూరం పెట్టేశారు.

అలా త‌మ‌ను ప‌వ‌న్ దూరం పెట్ట‌డ‌మే ఆ పార్టీల‌కు ఒక దెబ్బ అయితే ఇప్పుడు త‌మ సిద్ధాంతాల‌కు పూర్తి విరుద్ధ‌మైన బీజేపీతో ప‌వ‌న్ క‌లిసిన‌డ‌వాల‌నుకోవ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల ముందు బీజేపీ ప‌ట్ల తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ కేంద్రంలో బీజేపీ తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించిన త‌ర్వాత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఏపీలో ఒక మ‌తానికి అనుకూలంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, జ‌గ‌న్ మ‌త మార్పిడుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని ప‌క్కా బీజేపీ నేత లాగా మాట్లాడారు.

వివిధ సంద‌ర్భాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా త‌న‌కు ద‌గ్గ‌ర అని, వారికి ఫిర్యాదు చేస్తా జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు కూడా. మ‌రోసారి ఈ దేశానికి న‌రేంద్ర మోడీ, అమిత్ షా లాంటి నాయ‌కులే స‌రైన వారని సైతం కీర్తించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా ప‌వ‌న్ పాత స్నేహితులైన క‌మ్యూనిస్టులు ప‌వ‌న్‌పై దుమ్మెత్తి పోశారు.

అంత‌కాలం ఆయ‌న‌ను కీర్తించిన వారే ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌వ‌డం ఖాయం కావ‌డంతో క‌మ్యూనిస్టులు చేసిన చారిత్ర‌క త‌ప్పిదాల లిస్టులో ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకోవ‌డం కూడా ఒక త‌ప్పుగా చేర్చారు.

అయితే, ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన జ‌గ‌న్‌ను త‌ట్టుకొని నిల‌బ‌డాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక అండ అవ‌స‌రం. అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితేనే జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం సాధ్యం.

పైగా ఇప్ప‌టికే పార్టీని స్థాపించి ఆరేళ్లుగా అధికారం లేకుండా అనేక ప్ర‌యాస‌లు ప‌డుతూ పార్టీని న‌డిపిస్తున్నారు. ఒక పార్టీని న‌డిపించాలంటే కావాల్సిన వ‌న‌రులు, శ‌క్తియుక్తులు స‌మ‌కూర్చుకోవ‌డం అంత సులువు కాదు. ఇవ‌న్నీ ఆలోచించే ప‌క్కా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle