newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

లాక్ డౌన్ పొడిగింపులో జగన్ రూటే వేరయిందా.. కారణం ఏమిటి?

12-04-202012-04-2020 12:21:56 IST
Updated On 12-04-2020 13:16:09 ISTUpdated On 12-04-20202020-04-12T06:51:56.018Z12-04-2020 2020-04-12T06:51:53.030Z - 2020-04-12T07:46:09.638Z - 12-04-2020

లాక్ డౌన్ పొడిగింపులో జగన్ రూటే వేరయిందా.. కారణం ఏమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత రెండువారాలుగా అమలవుతున్న లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు వేరువేరు మార్గాలను అనుసరించడం విస్మయం గొలుపుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని..  వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని ప్రధానితో వీడియో కాన్ఫరెన్సులో పేర్కొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఊపిరి పోసేలా కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేని గ్రీన్ జోన్లలో  లాక్ డౌన్‌ ఆంక్షలను సడలించాలన్నది తన అభిప్రాయమని ప్రధానికి తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 81 రెడ్, ఆరెంజ్‌ జోన్ల  మండలాలకు లాక్‌డౌన్‌ను పరిమితం చేస్తూ మిగతా 595 (కరోనా కేసుల్లేని) గ్రీన్‌ జోన్‌ మండలాల్లో ఆంక్షలతో లాక్‌డౌన్‌ సడలించాలనేది తన అభిప్రాయమని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. 

కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ కొనసాగించాలా.. లేదా.. కొనసాగిస్తే ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే అంశాలపై శనివారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణకు తీసుకున్న చర్యలను, కోవిడ్‌ ఆసుపత్రుల సన్నద్ధత, లాక్‌డౌన్‌ కారణంగా నెలకొన్న సమస్యలను ప్రధానికి వివరించారు.  కోవిడ్‌–19 వ్యాప్తి నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని, లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ప్రధాన మంత్రిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 

1918లో వచ్చిన ఫ్లూ భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందనీ, రెండేళ్లకు పైగా అది దేశంపై ప్రభావం చూపిందనీ. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మనం దీర్ఘకాలం పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి  ప్రస్తుత పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడిచే విధంగా చూడాల్సి ఉందని ఏపీ సీఎం ప్రధానికి వివరించారు. కోవిడ్‌–19 నివారణకు ప్రధాన మంత్రిగా మీరు తీసుకున్న విశాలమైన, గట్టి చర్యలను బలంగా సమర్థిస్తున్నానని జగన్ చెబుతూనే కరోనా కేసులు నమోదు కానీ గ్రీన్ జోన్ మండలాల్లో పరిమిత ఆంక్షలతో లాక్ డౌన్ సడలించాలని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్‌ సోకిన రెడ్‌జోన్లలో 37 మండలాలు, ఆరెంజ్‌ జోన్లలో 44 మండలాలు (మొత్తం 81) ఉన్నాయి. గ్రీన్‌ జోన్‌లో ఉన్న మిగతా 595 మండలాలపై ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను రెడ్, ఆరెంజ్‌ జోన్లకే పరిమితం చేస్తే బావుంటుంది. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజా రవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలి. ఇవి కాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలి. మొత్తంమీద ఈ యుద్ధంలో ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలని జగన్ చెప్పారు.

వ్యవసాయం అటకెక్కితే దేశానికే ప్రమాదం

మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక. జీఎస్‌డీపీలో 35 శాతం, ఉపాధి కల్పనలో 62 శాతం వాటా వ్యవసాయానిదే. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది. నిలిపివేస్తారనే భయంతో 25 శాతం మించి ట్రక్కులు తిరగడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేవు. మార్కెట్లు నడవక పోవడంతో ధాన్యం, మొక్క జొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్థానికంగా వీటిని ఎంత వరకు వినియోగించగలం? ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. నిల్వ చేయడానికి తగిన స్టోరేజీ సదుపాయం లేక, ఎగుమతులు లేక ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోందని ఏపీ సీఎం ప్రధానికి తెలిపారు.

పారిశ్రామిక రంగం పనిచేయకపోతే జీతాలు ఉండవు

రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే 1,03,986 యూనిట్లకు గాను 7,250 మాత్రమే నడుస్తున్నాయి. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్డు, రైల్వే రవాణా నిలిచి పోవడం సంక్షోభం పెరగడానికి కారణమైంది. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తింది. కరోనా వైరస్‌ మరింతగా వ్యాపించకుండా దేవుడి దయ వల్ల అడ్డుకోగలుగుతున్నాం. మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం అని జగన్ తెలిపారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి. మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని సీఎం చెప్పారు.

595 గ్రీన్‌జోన్లలో లాక్‌డౌన్‌కు సడలింపునిస్తే వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ఊపిరి సలుపుతుందని, అప్పుడే ప్రజల కనీస అవసరాలు తీరేలా ఆర్థిక చక్రం ముందుకు కదులుతుందని వైఎస్ జగన్ ఏపీలో తీవ్ర సమస్యలను ప్రధాని ముందుకు తీసుకుపోయారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో స్తబ్ధత నెలకొందని, రాష్ట్రానికి ఆదాయం రాని పరిస్థితి..సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందని ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించి కేంద్రం ఆదుకోవాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle