newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

లబ్ధిదారుల డబ్బులు ముట్టొద్దు.. ఏపీ సీఎం ఆదేశం

26-09-201926-09-2019 15:03:41 IST
2019-09-26T09:33:41.198Z26-09-2019 2019-09-26T09:33:37.533Z - - 06-12-2019

లబ్ధిదారుల డబ్బులు ముట్టొద్దు.. ఏపీ సీఎం ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న డబ్బును పాత బకాయిల కింద ఎట్టిపరిస్థితుల్లోనూ జమ చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బ్యాంకర్లను హెచ్చరించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా తాము ముందడుగు వేస్తుంటే వాటికి కొర్రీ పెట్టేలా బ్యాంకులు వ్యవహరించవద్దని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్న డబ్బులను బ్యాంకులు జమ చేసుకోరాదని జగన్ బ్యాంకర్లకు స్పష్టం చేశారు.

లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా అందించే ప్రభుత్వ పధకాల నగదును బ్యాంకులు మినహాయించకుండా ఆన్ ఇన్ కంబర్డ్ పేరిట నిర్దేశిత బ్యాంకు ఖాతాలు తెరవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన  రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి లక్ష్యాలను బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని అన్నారు.

వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని, అందుకు సంబంధించిన రశీదును గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ అందిస్తారని చెప్పారు. సున్నా వడ్డీ కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు ఎంత చెల్లించాలో జాబితా ఇస్తే, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని, ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం ప్రతి నెలా ఒక పథకాన్ని అమలు చేస్తుందని, దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని కోరారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుకు వస్తుందని, దానిని సానుకూలంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

కాగా, కౌలు రైతుల కోసం ముఖ్యమంత్రి  తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయని నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సెల్వరాజ్‌ ప్రశంసించారు. దీని వల్ల వ్యవస్థీకృత ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు అందుతాయని అన్నారు. కేవలం పంట రుణాలే కాకుండా ఇతరత్రా రుణాలు కూడా కౌలు రైతులకు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Image result for CM YS Jagan Comments at State Level Bankers Committee Meeting


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle