లగడపాటి విశ్వసనీయతను భ్రష్టుపట్టించిందెవరు?
19-05-201919-05-2019 18:09:32 IST
Updated On 27-06-2019 14:55:49 ISTUpdated On 27-06-20192019-05-19T12:39:32.667Z19-05-2019 2019-05-19T12:36:49.689Z - 2019-06-27T09:25:49.543Z - 27-06-2019

తానేమీ ఈవీఎంలలోకి తొంగిచూడలేదని, తన సర్వేలను నమ్మి బెట్టింగ్ లు పెట్టవద్దని నిన్న లగడపాటి రాజగోపాల్ స్పష్టంగా చెప్పారు. అయినా ఆయన సర్వేలపై ప్రజల్లో క్రేజ్ చాలా ఉంది. వివిధ సందర్భాల్లో లగడపాటి అంచనాలు నిజమవడంతో ఆయనను ఆంధ్రా ఆక్టోపస్ గా పిలుస్తున్నారు. అయితే, ఆయన బెట్టింగ్ లు వద్దూ అని చెబుతున్నా లగడపాటి సర్వేలను నమ్ముకొని బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. నిబంధనల ప్రకారం చివరి దశ పోలింగ్ పూర్తైన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరాలు చెప్పాలి. కానీ, లగడపాటి మాత్రం నిన్ననే విజయవాడలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ చెప్పారు. ఇది నిబంధనల ప్రకారమే కాదు నైతికంగానూ సరైంది కాదనే వాదనలు ఉన్నాయి. పైగా ఇవాళ రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు బూత్ లలో రీపోలింగ్ కూడా జరుగుతుంది. నిబంధనలు, నైతికత అంశాలను పక్కన పెడితే లగడపాటి రాజగోపాల్ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనే ఆసక్తి నెలకొంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన చెప్పినా టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పినా ఇద్దరే గెలిచారు. ఇక, అంతకుముందు కూడా పలు సందర్భాల్లో లగడపాటి అంచనాలు తప్పాయి. 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందని, అన్నా డీఎంకే ఓడిపోతుందని లగడపాటి చెప్పారు. కానీ, ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించింది. తమిళనాడులో ఒకసారి గెలిచిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో గెలవదనే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి మరీ ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే గెలిచింది. ఇదే సమయంలో పలు ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ అంచనాలు నిజమయ్యాయి కూడా. 2012 కడప ఉప ఎన్నికల్లో జగన్ కు ఎంత మెజారిటీపై లగడపాటి అంచనా నిజమైంది. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే నిజమైంది. సీట్ల లెక్కలు కొంత అటుఇటు అయినా మొత్తంగా లగడపాటి చెప్పినట్లు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. లగడపాటికి ఎన్నికల సర్వేలు చేయడం ఒక హాబీ. ఆర్జీ ఫ్లాష్ టీమ్ అనే సంస్థతో కలిసి ఆయన సర్వేలు చెస్తారు. వివిధ ఎన్నికల్లో కొన్నిసార్లు ఆయన సర్వేలు నిజమయ్యాయి. మరికొన్నిసార్లు తప్పయ్యాయి. లగడపాటి సర్వేనే కాదు.. ఎగ్జిట్ పోల్స్ కూడా వివిధ ఎన్నికల్లో తప్పయ్యాయి. అంతెందుకు నిన్నటికి నిన్న ఆస్ట్రేలియా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి. కాబట్టి లగడపాటిని, ఎగ్జిట్ పోల్స్ ను నమ్ముకొని బెట్టింగులకు దిగితే మాత్రం రిస్క్ చేసినట్లే అని బెట్టింగ్ రాయుళ్లు తెలుసుకుంటే మేలు.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా