newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

లగడపాటి దెబ్బ...బెట్టింగ్ రాయుళ్ళ బోల్తా!

12-12-201812-12-2018 15:07:17 IST
Updated On 12-12-2018 15:26:46 ISTUpdated On 12-12-20182018-12-12T09:37:17.983Z12-12-2018 2018-12-12T09:37:16.114Z - 2018-12-12T09:56:46.314Z - 12-12-2018

లగడపాటి దెబ్బ...బెట్టింగ్ రాయుళ్ళ బోల్తా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికలు జరగడానికి ముందువరకూ టిఆర్ఎస్ పార్టీకే అనుకూల వాతావరణం ఏర్పడింది. ‘ప్రజాకూటమి’ రంగప్రవేశం అనంతరం కాస్త గందరగోళం నెలకొన్నా... టిఆర్ఎస్‌నే విజయం వరించవచ్చనే అంచనాలున్నాయి. అనుకున్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. జాతీయ మీడియా మొత్తం ‘కారు’లోనే సవారీ చేసింది. దీంతో బెట్టింగ్‌రాయుళ్ళందరూ ఆ పార్టీ మీదే లక్షల్లో, కోట్లల్లో బెట్టింగ్స్ వేశారు. ఆ పార్టీనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు కాశారు. కానీ... లగడపాటి సర్వే అనంతరం సీన్ మారిపోయింది. ప్రజాకూటమే అధికారంలోకి వస్తుందని ఆయన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో... పందేలు మరింత జోరందుకున్నాయి.

లగడపాటి సర్వేలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. తమిళనాడు ఎన్నికలపై తప్ప... 2005 నుంచి ఆయన చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. దీంతో లగడపాటి ప్రజాకూటమికి మద్దతుగా సర్వే తెలపడంతో... బెట్టింగ్‌రాయుళ్ళలో చాలామంది ‘కారు’ దిగి ‘ఫ్రంట్’ బాట పట్టారు. లగడపాటి సర్వే ఫలితాల ప్రకారం ప్రజాకూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెరాసకు 50 స్థానాలు కూడా రావని, కూకట్‌పల్లిలో టిడిపిదే విజయమంటూ ‘ఫ్రంట్’పై బెట్టింగ్స్ వేశారు. తీరా ఫలితాలొచ్చాక అందరూ బొక్కబోర్లా పడ్డారు. లగడపాటి సర్వే విఫలం కావడం వల్ల ఫ్రంట్‌పై పందేలు కాసిన వాళ్ళందరూ నిండా మునిగిపోయారు. కోట్లలో నష్టపోయారు.

బెట్టింగ్‌లో బోల్తాపడ్డ వాళ్ళు!
- తెరాస ఓడిపోతుందని ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి రూ.5 కోట్లకు పందెం కాశాడు. కానీ... టిఆర్ఎస్ గెలవడంతో అతడు నిండా మునిగిపోయాడు.
- అదే జిల్లా కారంచేడు మండలంలో ఓ వ్యక్తి ప్రజాకూటమి గెలుస్తుందని 5 ఎకరాలు పందెం కాసి... పొలాన్ని పోగొట్టుకున్నాడు.
- అదే జిల్లా రాజుపల్లి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు కూటమి తరఫున రూ. 90 లక్షలు పందెం కాసి మునిగిపోయారు.
- కృష్ణా జిల్లాలో ఎక్కువమంది కూకట్‌పల్లి టిడిపి అభ్యర్థి సుహాసిని 10 వేల మెజార్టీతో గెలుస్తుందని రెండు కోట్లు పందెం వేసి... డబ్బులు పోగొట్టుకున్నారు.
- గుంటూరు జిల్లాకు చెందిన ఒక రైతు తెరాస ఓడిపోతుందని పందెం కాసి 10 ఎకరాలు పొగొట్టుకున్నాడు.
- ఇంకా వెలుగులోకి రాని మరెంతో మంది ప్రజాకూటిమిని నమ్ముకుని బెట్టింగ్స్ వేసి... చేతులు కాల్చుకున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle