newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

లక్ష్యం చేరని సంక్షేమం? హౌసింగ్ మాయే ఇందుకు నిదర్శనం!

18-10-201918-10-2019 07:40:35 IST
Updated On 18-10-2019 15:13:21 ISTUpdated On 18-10-20192019-10-18T02:10:35.632Z18-10-2019 2019-10-18T02:10:11.363Z - 2019-10-18T09:43:21.450Z - 18-10-2019

లక్ష్యం చేరని సంక్షేమం? హౌసింగ్ మాయే ఇందుకు నిదర్శనం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సంక్షేమ పథకాలు లక్ష్యం చేరుతున్నాయా? అంటే ఔననే సమాధానం లభించడం కష్టం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలూ కూడా సంక్షేమ పథకాలపై అధికంగానే వెచ్చిస్తున్నా..లక్ష్య సాధన విషయంలో మాత్రం దూరంగానే నిలిచిపోతున్నాయి. నిధులు ఖర్చు కావడం వినా ఫలితం దక్కని పరిస్థితి కనిపిస్తున్నది. ఇందుకు హౌసింగ్ ఒక చక్కటి ఉదాహరణ.

ఇప్పటి వరకూ లెక్కల్లో లక్షలు, కోట్ల గృహాలను నిర్మించినట్లు ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పిస్తున్నా...గృహవసతికి నోచని పేదల సంఖ్య ఏటికేడు పెరిగిపోతూనే ఉంది. ఎప్పుడూ ఇదో మిస్టరీగానే మిగిలిపోతున్నది. ప్రభుత్వాలు కట్టించిన గృహాలు ఏమయ్యాయి. మాయం అయిపోతున్నాయా? లేక ప్రభుత్వాల ప్రకటనలన్నీ అంకెల గారడీయా అన్నది తెలియని పరిస్థితి ఉంది.

కేంద్రంతో పాటు రాష్టాలు కూడా పట్టణ, గ్రామీణ గృహాలంటూ లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తూనే ఉన్నాయి.   లబ్ధిదారులు మిగిలిపోతూనే ఉన్నారు. మరి ఇన్నేళ్ల నుంచీ కట్టించిన గృహాలు ఏమైనట్లు.   తెలంగాణలో డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు   ఎపిలో కూడా చంద్రబాబు హయాంలో జరిగిన గృహ నిర్మాణం ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్‌ హయాంలో   ఇందిరమ్మ ఇళ్లు... అలాగే కేంద్రం కూడా పేదరిక నిర్మూలన పథకం కింద నిర్మించిన లక్షల గృహాలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంఖ్య చాలా చాలా పెద్దది.

అయినా ఇంకా లక్షల్లో పేదలు గృహ వసతికి దూరంగా ఉన్నారు.   ఎపిలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం  కింద ఏటా సంఖ్యలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వందల కోట్ల రూపాయలు దీని కోసం చేస్తున్నారు. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చాక పథకం పేరు మార్చి మళ్లీ అమలు చేస్తున్నారు. అయినా నిలువ నీడలేని నిర్భాగ్యుల సంఖ్య పెరుగుతోందే గాని తగ్గడం లేదు.   అమలులో చిత్తశుద్ది లోపమే ఇందుకు కారణమనడంలో సందేహం లేదు.

సమైక్య రాష్ట్రంలో వైఎస్‌ రాజశేర్‌రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ ఇవే ఆరోపణలు  చేసింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇందిరమ్మ ఇళ్లపై జరిపిన దర్యాప్తులో బోలెడు లొసుగులు బయటపడ్డాయి. 

వాస్తవానికి హౌసింగ్ పథకంలో నిర్మాణాలు చాలా వరకూ కాగితాలపైనే జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చి అవకతవకలపై దర్యాప్తు జరపడం జరుగుతోంది. ఆ తరువాత అంతా మామూలే...మళ్లీ గృహ నిర్మాణంలో లొసుగులు యథాతథంగా సాగుతున్నాయి.   వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగినట్లుగా ప్రభుత్వాలు ఎంత ఘనంగా ప్రచారం చేసుకున్నా ఇంటి కోసం పేదలు చేసుకున్న దరఖాస్తులు కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోయి ఉండడానికి కారణం ఇదే.

కాగితాలకే పరిమితమై...ప్రచారంలో కోటలు దాటుతున్న పథకాల వల్ల వాస్తవంగా ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. గత ప్రభుత్వాల లక్ష్యాలనే తదుపరి వచ్చిన ప్రభుత్వాలు ప్రకటించడానికి కారణం కూడా ఇదే. పేదల సంక్షేమమే లక్ష్యం అని చెప్పుకునే ఏ ప్రభుత్వమైనా అధికారంలోనికి వస్తుంది.

ఆ క్రమంలో గత ప్రభుత్వ తప్పిదాలపై విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ ఆ తరువాత అదే తప్పిదాలు పునరావృతం కావడమంటే అసలు పథకాల రూపకల్పనలోనే, వాటి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనే ఏదో లోపం ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికైనా పథకాల ప్రకటనతో పాటు వాటి పటిష్ట కార్యాచరణకు కూడా రూపకల్పన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   5 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   5 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   5 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   9 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   11 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   14 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   14 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   15 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   15 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle