newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్.. కడప జేసీపై ఈసీ వేటు

14-05-201914-05-2019 08:04:03 IST
Updated On 28-06-2019 12:31:52 ISTUpdated On 28-06-20192019-05-14T02:34:03.292Z14-05-2019 2019-05-14T02:29:55.165Z - 2019-06-28T07:01:52.094Z - 28-06-2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్.. కడప జేసీపై ఈసీ వేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల వేళ రాంగోపాల్ వర్మ తన  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీతో రచ్చరేపారు. ఈ సినిమాను తెలంగాణలో విడుదల చేశారు. కానీ ఏపీలో ఈసీ అనుమతి మంజూరు చేయలేదు. ఏపీలో ఎన్నికలు ముగిసినందున వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఈ మేరకు రాం గోపాల్ వర్మ ప్రమోషన్‌కు వెళ్లగా విజయవాడలో పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో ఈ సినిమా మరోసారి వివాదంగా మారి వార్తల్లోకెక్కింది. ఈసీ అధికారులు సినిమాను రిలీజ్ చేయవద్దని మరోసారి స్పష్టం చేశారు.

నిషేధం అమలులో ఉన్నా ఏపీలోని  శ్రీకాకుళంలోనూ ఈ మూవీని విడుదల చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కడపలో ఈ మూవీ విడుదల చేయడం వివాదాస్పదం అయింది. ఈసీ సీరియస్ కావడంతో వ్యవహారం ముదిరిపాకాన పడింది. 

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని కడప జిల్లాలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)పై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఆ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.  క‌డ‌ప జిల్లాలో రెండు థియేట‌ర్స్ లైసెన్స్ రద్దుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వీటిని అధికారులు సీజ్ చేశారు.

అయితే,  కొన్ని థియేటర్లలో చిత్రం ప్రదర్శించడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జేసీ కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని విధుల్లో ఆయన్ను నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 19 వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను విడుదల చేయొద్దని మరోసారి ఈసీ స్పష్టం చేసింది.

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   41 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   3 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle