newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

లక్ష్మీపార్వతిపై ఆరోపణలు.. ఆమె ఏమందంటే...?

07-04-201907-04-2019 09:47:25 IST
Updated On 08-07-2019 14:16:49 ISTUpdated On 08-07-20192019-04-07T04:17:25.760Z07-04-2019 2019-04-07T03:56:46.691Z - 2019-07-08T08:46:49.158Z - 08-07-2019

లక్ష్మీపార్వతిపై ఆరోపణలు.. ఆమె ఏమందంటే...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తోంటే.. ఆ సినిమాకు నిజజీవిత హీరో అయిన లక్ష్మీ పార్వతిపై వేధింపుల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గణేష్ అనే వ్యక్తి లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధించారంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీనిపై లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. ఓ సినీ నిర్మాత వినుకొండకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్టును తన ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడని లక్ష్మీ పార్వతి చెప్పారు. తన తల్లికి ఎప్పుడైనా మందులు తీసుకొచ్చి ఇచ్చేవాడనీ, ఇంట్లో పనివాడిలా చూశామనీ చెప్పారు. 

తల్లిలాంటి తనను ఇలాంటి నిందలు వేశారంటే ఇది ఎన్నికలకు ముందు జరిగిన కోవర్ట్ ఆపరేషన్ అనేది లక్ష్మీ పార్వతి వాదన. అలాగే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికీ ఈ లైంగిక ఆరోపణలకు సంబంధం ఉందని కూడా ఆమె చెప్తున్నారు. చంద్రబాబు నాయుడి నిజస్వరూపాన్ని ఆ సినిమా ద్వారా ప్రజలకు తెలిసింది కాబట్టి అందుకు కారణం నేను రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు కాబట్టి, నా క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేస్తున్నారు అని ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి చెప్పారు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తన క్యారెక్టర్‌పై నిందలు వేసే ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. 

టీడీపీకి అనుబంధంగా పని చేసే ఛానెళ్లలో నడిపిస్తున్న డ్రామానే ఇదంతా అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కోర్టు ద్వారానే తేల్చుకుంటానని కూడా ఆమె చెప్పారు. 60 ఏళ్ల వయసులో తనపై ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆవేదనకు గురి చేశాయన్నారు.

చంద్రబాబు కుటుంబానికి చెందిన ఆడవాళ్లు, బాలకృష్ణ ఫ్యామిలీలోని వారి సంబంధాల గురించి తనకు మాత్రమే పూర్తిగా తెలుసన్న లక్ష్మీ పార్వతి.. కేవలం ఎన్టీఆర్ పరువు కోసమే తాను నోరు విప్పడం లేదన్నారు. అయినా ఎన్నికలకు ముందు ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం, గంటలు గంటలు చర్చలు పెట్టడంపై ఆమె మండిపడుతున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle