లంగరు తెగింది.. బోటు తేలేదెప్పుడు?
02-10-201902-10-2019 12:32:27 IST
2019-10-02T07:02:27.316Z02-10-2019 2019-10-02T07:02:23.390Z - - 08-12-2019

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బోటు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణీకులు, బోటు సిబ్బందితో కలిపి మొత్తం 73 మంది ఉన్నారని ప్రభుత్వం తీరిగ్గా బోటు మునిగిన పదిరోజులకు లెక్కలు చెప్పింది. అయితే ఇది ఎంతవరకు పక్కా లెక్కలు అన్నది ఇప్పటికీ అనుమానమే. కాగా అందులో మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 33 మృతదేహాలు నీటిలో నాని ఉబ్బిపోయి బయటపడ్డాయి. అందులో కొన్ని సగం నదిలో ప్రాణులు తిని పురుగులుపట్టి గుర్తుపట్టలేనంతగా కొట్టుకొచ్చాయి. ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు. ఆచూకీ దొరకని ఆ 14 మంది బోటులోనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉంటే బతికే ఉన్నారా, చనిపోయారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. కానీ ప్రభుత్వం మాత్రం చనిపోయారని అధికారికంగా ప్రకటించేసి కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలిచ్చి మరీ డెత్ సర్టిఫికెట్లను ఇచ్చేయమంది. అయితే మిస్సింగ్ గా నమోదైన వాళ్ళను మరణించినట్టు ఎలా ప్రకటిస్తారని వారి బంధువులు గగ్గోలు పెట్టినా వృధాప్రయాసే. డెత్ సర్టిఫికెట్లు తీసుకొంటే ఇన్పిరెన్స్ కంపెనీ నుండి వచ్చే పదిలక్షల పరిహారం త్వరగా అందుతుందని కలెక్టర్ కార్యాలయంలో చెప్పడం విశేషం. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాలు ఒడ్డుకి కొట్టుకొస్తున్నఆ రోజున గల్లంతైన వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. తమవాళ్లు బ్రతికి వస్తారని ఆశ ఎలాగూ లేదు.. కనీసం దొరికిన మృతదేహమైనా తమ వారిదైదే చాలని దేవుడిని తలచి అందరూ దొరికిన డెడ్ బాడీ చుట్టూ చేరి అది తమవారిది కాకపోవడంతో.. దేవుడా కడసారి చూపు కూడా దక్కదా అంటూ విలపించిన తీరు చూస్తే కడుపుతరుక్కుపోయింది. ఇదంతా గడిచి పదిరోజులైంది. ఇక ఈ ఘటనలో మిగిలిన ఒకటే సమాధానం ముందు బోటు బయటకురావాలి. మరి బోటు పరిస్థితి ఏంటి? 215 అడుగుల లోతున ఉందని కొందరు.. 350 అడుగుల లోతున ఉందని కొందరు అలా ఓ వారం గడిచింది. ఘటన జరిగిన 15 రోజులకు గాని ప్రభుత్వం రూ.22.70 లక్షలకు ఒప్పందంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యానికి (బాలాజీ మెరైన్స్) బోటు వెలికితీత పనులను అప్పగించింది. సత్యం అండ్ టీం గత రెండు రోజులుగా వెలికితీత పనులను చేస్తుంది. మొన్న తొలి రోజు మొత్తం 22 మంది ఎక్స్పర్ట్స్.. 25 మంది మత్స్యకారులు కలిసి బోటు, పంటు సహాయంతో నీటిలోకి లంగర్లను జార విడిచారు. ఒడ్డున జేసీబీలు, పొక్లెయినర్ల లాగేందుకు ప్రయత్నించారు. నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ రెండోరోజు పనులలో తెగిపోయి దాదాపు వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. ఇక మధ్యాహ్నం వేసిన లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. ఈలోగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలమయ్యాయి. పోలీసులు మీడియాను కూడా అనుమతిని నిరాకరిస్తూ సత్యం అండ్ కోకు పూర్తిగా సహకరిస్తున్నారు. మూడవరోజు మరోసారి లంగర్ వేసి బోటును లాగేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. లంగర్ ద్వారా పనికాకపోతే మరో అవకాశమేంటి? ధర్మాడి ప్రయత్నాలు ఫలిస్తాయా? మరి ఈరోజు ఏం జరుగుతుంది? స్టిల్ వెయిటింగ్!

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
an hour ago

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
4 hours ago

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
5 hours ago

అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
a day ago

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
a day ago

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
07-12-2019

ఆ ఆరు జీవోలు నిలిపివేత.. జగన్ సంచలన నిర్ణయం
07-12-2019

ఒక్క ఎన్కౌంటర్... అనేక వాదనలు..!
07-12-2019
ఇంకా