newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

ర‌స‌వ‌త్త‌రంగా ఏపీ రాజ‌కీయం..!

11-09-201911-09-2019 12:03:36 IST
2019-09-11T06:33:36.125Z11-09-2019 2019-09-11T06:33:34.317Z - - 15-09-2019

ర‌స‌వ‌త్త‌రంగా ఏపీ రాజ‌కీయం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అధికార‌పార్టీపై ప్ర‌తిప‌క్ష టీడీపీతోపాటు బీజేపీ కూడా విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెడుతోంది. అటు విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు అధికార పార్టీ కూడా ధీటుగా బ‌దులు ఇస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్దంగా పాల‌న‌ను సాగించ‌లేద‌ని మండిప‌డ్డారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుపై గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చారో.. లేదో చెప్పాలంటూ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చంద్ర‌బాబును డిమాండ్ చేశారు. వైసీపీ స‌ర్కార్ కొలువుదీరాక ఏ కంపెనీలు వెన‌క్కు వెళ్లాయో చెప్పాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ నిల‌దిశారు.

మ‌రోప‌క్క అనంత‌పురం జిల్లాలో వైసీపీ నేత‌ల అరాచ‌కాలు శృతిమించుతున్నాయ‌ని మాజీ మంత్రులు, టీడీపీ నేత‌లు ప‌రిటాల సునీత‌, కాల్వ శ్రీ‌నివాసులు అన్నారు. జిల్లాలో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లపై ఎస్పీని క‌లిసి ఫిర్యాదు కూడా చేశారు.

బ్ర‌హ్మ‌స‌ముద్రం మండ‌లంలో టీడీపీ శ్రేణుల‌కు చెందిన‌ దానిమ్మ తోట‌లను నరికివేయ‌డంతోపాటు రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను వారు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్ర‌జ‌లు వైసీపీకి అధికార‌మిచ్చార‌ని, కానీ ఆ పార్టీ నేత‌లు ప‌ట్ట‌ణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వ‌ర‌కు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఆఖ‌ర‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి జిల్లాలో కూడా రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి రాయ‌ల‌సీమ‌లో ఉంద‌ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు.

విభ‌జ‌న త‌రువాత కూడా రాయ‌ల‌సీమ‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని, గ‌త ఐదు బ‌డ్జెట్‌ల‌లో కూడా చిన్న‌చూపు చూశార‌ని మండిప‌డ్డారు. రాయ‌ల‌సీమ‌ను రెండోరాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తారో .. లేదో.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇలా ఏపీ రాజ‌కీయాల్లో పైచేయి సాధించ‌డం కోసం అన్ని పార్టీల నేత‌లు ఎవ‌రికి వారు పోటీప‌డుతున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle