newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలు ధరలో తేడా అక్కడే వచ్చింది : సీఎం జగన్ స్పష్టీకరణ

21-04-202021-04-2020 08:07:10 IST
Updated On 22-04-2020 14:22:55 ISTUpdated On 22-04-20202020-04-21T02:37:10.003Z21-04-2020 2020-04-21T02:37:07.218Z - 2020-04-22T08:52:55.796Z - 22-04-2020

ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలు ధరలో తేడా అక్కడే వచ్చింది : సీఎం జగన్ స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. అవినీతి రహితంగా పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు అభినందనలు తెలియజేశారు. బయటి నుంచి కొన్నప్పుడు దక్షిణ కొరియా కిట్లకు ఒక రేటు పలికిందని, అదే భారత్‌లోనే తయారు చేయడం మొదలెట్టాక ఆ కంపెనీ తక్కువ రేటు ప్రకటించిందని జగన్ తెలిపారు.  అయితే తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా కిట్లను అమ్మితే ఏపీ కూడా అంతే రేటు చెల్లిస్తుందని ముందు జాగ్రత్తగా ఒప్పందంలో రాసుకోవడం వల్ల కంపెనీ మనకు కూడా తక్కువ రేటుకే వాటిని అమ్మడానికి అంగీకరించిందని జగన్ తెలిపారు.

మనం ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయి. ఇప్పుడు ఆ కిట్లను మన దేశంలోనే తయారు చేయడానికి అదే కంపెనీకి ఐసీఎంఆర్‌ అనుమతిచ్చింది. అందువల్ల కిట్‌ రేటు తగ్గింది. మనం ముందు చూపుతో పెట్టుకున్న షరతు కారణంగా మన రేటు కూడా తగ్గబోతోంది. ఇందుకు ఆ కంపెనీ అంగీకరించిందని సీఎం జగన్ వివరించారు. చాలా నిజాయతీగా ఆలోచించి కోవిడ్‌–19 పరీక్షల కిట్లను ఆర్డర్‌ చేశారని వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. 

సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్ష సందర్భంగా ఈ కిట్ల ధరపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కిట్ల కొనుగోలు వెనుక వాస్తవాలను బహిర్గతం చేశారు.  

AP CM launches indigenous test kits - iDreamPost.com

‘మనకు కిట్లు అవసరం. కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీరు కొనుక్కోండి అని కేంద్రం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన కంపెనీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్డర్‌ ఇచ్చింది. ఐసీఎంఆర్‌ రూ.795 చొప్పున కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ విషయం తెలిసీ కూడా అంతకంటే రూ.65 తక్కువ ధరకు ఏపీ ఆర్డర్‌ ప్లేస్‌ చేసింది. ఒకవేళ తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే.. ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టం చేశారు.  ఇలాంటి ఆలోచన ఎవరూ చేయరు. రాజీ పడకుండా, కిట్లను వేగంగా తెప్పించుకోవడంలో ఆలస్యం చేయకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే పేమెంట్‌ ఇచ్చారని జగన్ తెలిపారు.

ఇంత ఒత్తిళ్ల మధ్య మంచి ఆలోచనతో కొనుగోలు చేశారు. అవినీతి అన్నది ఎక్కడా లేకుండా ఉండాలన్న ఆలోచనలకు అనుగుణంగా మీరు పని చేస్తున్నారు. వైద్య శాఖ అధికారుల ముందు చూపును అభినందిస్తున్నాను అని జగన్ ఆరోగ్య శాఖ అధికారులకు మద్దతునిచ్చారు.

గత మూడురోజులుగా ఏపీలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు ఒప్పందంపై భారీ కుంభకోణం జరిగిందని ప్రతిఫక్షాలు, మీడియాలో వస్తున్న ఆరోపణలను సీఎం కొట్టివేయడమే కాకుండా తమకు పూర్తి భరోసా ఇవ్వడంతో ఆరోగ్యశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ‘మీరు మాకు స్వేచ్ఛ ఇచ్చారు.. దాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ పడకుండా అడుగులు ముందుకేస్తున్నాం’ అని అధికారులు సీఎంతో అన్నారు.  

ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లు విడుదల

దక్షిణ కొరియానుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేయడంలో గోల్ మాల్ జరిగిందని తనపై పెద్ద ఎత్తువ వస్తున్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఆధారసహితంగా తప్పు అని ఖండించింది. ఒక్క కిట్టు వ్యవహారంలోకూడా అవినీతి చోటు చేసుకోలేదనడానికి నిదర్శనంగా కరోనా వైరస్ ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లకు చెందిన ఒప్పంద పత్రాలను సోమవారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. పైగా అనవసరంగా గత కొన్నిరోజులుగా తమపై సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్న

పారదర్శకంగా కరోనా వైరస్‌ ర్యాపిడ్‌ కిట్ల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కిట్ల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా వృథా కాలేదని సాక్ష్యాధారంతో తెలిపింది. దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుంది. అదేవిధంగా రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజును పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది.

ఛత్తీస్‌గఢ్‌లో రూ.335కి కొనుగోలు చేసినట్టు ప్రచారం జరగగా.. ఆ అంశంపై కిట్ల సరఫరా కంపెనీకి నోటీసులు పంపించి.. అతి తక్కువ ధరనే చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  పర్చేజ్ ఆర్డర్‌లో షరతు మేరకు చెల్లింపులు చేస్తామని పేర్కొంది. ఇవే కిట్లను రూ. 790కి ఐసీఎంఆర్ కొనుగోలు చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన సంస్థకే ఏపీ ప్రభుత్వం ఆర్డర్ చేసినట్లు డాక్యుమెంట్లు విడుదల చేయడంతో  ఈ అంశంపై రెండురోజులుగా జరుగుతున్న తప్పుడు ప్రచారం బట్టబయలైంది. అనవసరంగా తనపై అభాండాలు వేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle