newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

రోడ్డుపై టెంట్.. తుళ్ళూరు రైతుల మహా నిరసన

23-12-201923-12-2019 09:28:31 IST
Updated On 23-12-2019 10:58:37 ISTUpdated On 23-12-20192019-12-23T03:58:31.727Z23-12-2019 2019-12-23T03:55:27.791Z - 2019-12-23T05:28:37.960Z - 23-12-2019

రోడ్డుపై టెంట్.. తుళ్ళూరు రైతుల మహా నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు వెలుగు వెలిగిన అమరావతి రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. జగన్ మూడు రాజధానుల ఆలోచనతో ఈ ప్రాంత రైతుల కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఇవాళ అమరావతి రైతుల మహాధర్నను పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Image

సచివాలయానికి వెళ్లే రహదారిపై భారీ భద్రత ఏర్పాటు చేసీ.. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తున్నారు. వాహనాల నెంబర్లు నోట్ చేసుకొని.. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తుల ఆధార్ కార్డులు కూడా పరిశీలిస్తున్నారు. అనుమానితులను అప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. 

తుళ్లూరులో ధర్నా కోసం రైతులు టెంట్లు వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడ ధర్నాకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో రైతులు, స్థానికులు నినాదాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు మందడం ప్రధాన రహదారిపై కూడా రైతులు ధర్నాకు సిద్దపడ్డారు.

సోమవారం కావడం, సచివాలయానికి వెళ్లే రోడ్డు కావడంతో ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  తుళ్లూరులో రోడ్డుపై టెంట్ వేయడానికి రైతులు ప్రయత్నించారు.  దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి రైతులకు మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు వారికి సర్దిచెప్పారు. అయితే రైతులు మాత్రం ససేమిరా అన్నారు. ఎట్టకేలకు  పంతం నెగ్గించుకొని రోడ్డుపై టెంట్ వేసి తమ పంతం నెగ్గించుకున్నారు రైతులు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle