newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

రోజా గెలుపు అంత ఈజీ కాదా..?

10-04-201910-04-2019 12:21:48 IST
2019-04-10T06:51:48.423Z10-04-2019 2019-04-10T06:51:45.140Z - - 19-10-2019

రోజా గెలుపు అంత ఈజీ కాదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బలంగా గొంతు వినిపించే ఎమ్మెల్యే ఆర్కె రోజా మరోసారి నగరిలో టఫ్‌ఫైట్ ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో సీనియర్ నేత గాలి ముద్ధుకృష్ణమనాయుడుపై 850 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన రోజా ఈసారి ఆయన కుమారుడు గాలి భానుప్రకాశ్‌ను ఎదుర్కొంటున్నారు. తమిళనాడుకు శివారున ఉండే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పార్టీలు.

తన స్వంత డబ్బులతో చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీ బలం, తన వ్యక్తిగత ఇమేజ్‌ను నమ్ముకొని రోజా ఎన్నికల బరిలో దిగుతుండగా తండ్రి ఇమేజ్‌ను, పార్టీ బలాన్ని నమ్ముకొని గాలి భానుప్రకాష్ పోటీలో నిలిచారు. ఇద్దరూ బలమైన వారే కావడంతో నగరి నియోజకవర్గంలో పోరు తీవ్రంగా ఉందనుంది. గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడును స్వల్ప తేడాతో ఓడించి రోజా సంచలనం సృష్టించారు.

అయితే, పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో రోజా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనుకబడ్డారు. అయినా, స్వంత డబ్బులతో కొన్ని సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించారు. నాలుగు రూపాయలకే భోజనం పెట్టడంతో పాటు పలు అభివృద్ధి పనులను ఆమె తన స్వంత డబ్బుతో చేశారు. 

రాజ్యసభ సభ్యుల నిధులతోనూ కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. కానీ, నియోజకవర్గంలో ఆమె ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండరనే పేరుంది. ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక, తమిళ ఓటర్లు ఎక్కువగా ఉండటం రోజాకు కలిసిరావచ్చు. తన భర్త సెల్వమణి తమిళుడు కావడం ఆమెకు మేలు చేస్తోంది. పార్టీలో బలమైన నేతగా ఉండటం, రాష్ట్రస్థాయి నాయకురాలిగా మారడం కూడా రోజాకు కలిసిరావచ్చు. నియోజకవర్గ వైసీపీలో ఎటువంటి అసంతృప్తి లేకుండా క్యాడర్ అంతా రోజా గెలుపునకు పనిచేస్తుండటం కూడా కలిసొస్తోంది.

ఇక, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నా రాజకీయాలకు మాత్రం ఆయన కొత్తేమీ కాదు. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నప్పుడు కూడా క్యాడర్‌తో భాను సత్సంబంధాలు కలిగి ఉండేవారు.  ఆయనకు స్వంత కుటుంబంతో పాటు పార్టీలోనూ కొంత అసమ్మతి ఉండటం చేటు చేస్తోంది.  నియోజకవర్గంలో తన తండ్రి చేసిన సేవలు, తండ్రి మరణంతో సానుభూతి ఉండటం, పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, టీడీపీకి ఉన్న బలం గాలి భానుకు కలిసివచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గత ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో మొదటిసారి విజయం సాధించిన రోజా రెండోసారి కూడా తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle