newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

రోజాను జగన్ బుజ్జగించారా? నిజమేనా?

12-06-201912-06-2019 08:24:29 IST
Updated On 24-06-2019 12:15:28 ISTUpdated On 24-06-20192019-06-12T02:54:29.243Z12-06-2019 2019-06-12T02:53:55.778Z - 2019-06-24T06:45:28.429Z - 24-06-2019

రోజాను జగన్ బుజ్జగించారా? నిజమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి కోసం ఎడతెగని ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆమెను జగన్ అమరావతికి పిలిపించారని వస్తున్న వార్తలు నిజమేనా? రోజాకు జగన్ ఇవ్వబోయే పదవి ఏంటి? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే తనను ఎవరూ పిలవలేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా. అదంతా మీడియా కల్పనే అని కొట్టిపారేశారు. 

తనకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు.  విజయవాడకు వచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చానని స్పష్టం చేశారు. మంత్రి పదవి దక్కలేదని తనకు ఏమాత్రం బాధలేదన్నారు. కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తాను అలిగానని వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. 

జగన్ మంత్రివర్గంలో తనకు చోటివ్వకపోయినా తన ప్రాధాన్యత తగ్గలేదన్నారు. తాను కులాలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికి రోజా శుభాకాంక్షలు తెలిపారు. న‌గ‌రి నుండి వ‌రుస‌గా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా..వైసీపీ అధికారంలోకి రావ‌టంతో జ‌గ‌న్ ఖ‌చ్చితంగా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆశించారు.

అయితే, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి..ఎస్సీ వ‌ర్గానికి చెందిన నారాయ‌ణ స్వామికి జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్తులు ద‌క్కాయి. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌టంతో..అదే వ‌ర్గానికి చెందిన రోజాకు ఇక అదే జిల్లా నుండి మంత్రి ద‌క్క‌లేదు.

జ‌గ‌న్ కేవ‌లం బుజ్జ‌గించి రెండో విడ‌తలో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇస్తారా..లేక ప్ర‌స్తుతం నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తారా అనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా..ఇప్ప‌టికే జ‌గ‌న్ సైతం నామినేటెడ్ ప‌ద‌వుల భర్తీ పైన దృష్టి సారించారు. రోజా స‌హ‌చ‌ర ఎమ్మెల్యే అయిన చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి విప్ ప‌ద‌వితో పాటుగా తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కేటాయించారు. మరి రోజా జగన్ ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటి? 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle