newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

రైతు సాయంతో గట్టెక్కుతారా?

18-01-201918-01-2019 14:59:08 IST
2019-01-18T09:29:08.027Z18-01-2019 2019-01-18T09:29:04.984Z - - 17-07-2019

రైతు సాయంతో గట్టెక్కుతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు దేశంలోని రాజకీయనేతలంతా అన్నదాతలపై ఎన్నడూలేనంత ప్రేమ ఒలకబోస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు రకరకాల పేర్లతో పథకాలను తెరమీదకు తేవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న పథకానికి మార్పులు చేర్పులు చేసి ఎన్నికల ముందు వరాల మూట విప్పుతున్నారు. తెలంగాణలో ‘రైతు బంధు’ పథకం కేసీఆర్‌కు ఓట్లు రాల్చింది. మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇదే తరహా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చివరిరోజు రైతు బంధు తరహా పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎకరానికి పంట సాయం కింద 12, 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అటువంటిదే ఇప్పుడు చంద్రబాబు నోటినుంచి వినిపిస్తోంది. ప్రతి రైతుకూ పెట్టుబడి నిధి అందించాలని, కౌలు రైతులకూ ప్రయోజనం కలిగేలా చూడాలని బాబు భావిస్తున్నారు. ఈ ఖరీఫ్‌ పంట నుంచే దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తే.. తాము అమలుచేస్తామని చంద్రబాబు ఈమధ్యే ప్రకటించారు. వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన చంద్రబాబు...రైతులపై తన దృష్టి కేంద్రీకరించారు. రైతులకు పంట పెట్టుబడి చెల్లింపు అంశంపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ఈనెల 21న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం వెలువడనుందని అమరావతి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా ప్రభుత్వమే వారికి ఈ సాయం అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణకంటే మెరుగ్గా భూమిని స్వయంగా సాగుచేసుకునే యజమానులతో పాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

ఏపీలో ఉన్న సాగుభూమి ఎంత? అందులో కౌలురైతులు ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఎకరాకు ఎంత సాయం చేయాలనేది ఇంకా నిర్ధారణ కాలేదు. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే... సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని... ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఏపీలో వ్యవసాయం తర్వాత మత్స్య పరిశ్రమపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. రైతులను ఆదుకుంటే ఆత్మహత్యలు కూడా ఉండవని, రైతు సౌభాగ్యం రాష్ట్రానికి శుభకరం అనే భావనలో ఉన్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద తెలంగాణ తరహా రైతుబంధు... ఎన్నికల వేళ తమకు ఆపద్బంధు అవుతుందని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle