newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

రైతు రుణమాఫీ రద్దు.. రైతు భరోసా ముద్దు.. అక్టోబర్ 15న ప్రారంభం..

26-09-201926-09-2019 07:04:23 IST
Updated On 26-09-2019 14:12:07 ISTUpdated On 26-09-20192019-09-26T01:34:23.028Z26-09-2019 2019-09-26T01:34:19.525Z - 2019-09-26T08:42:07.406Z - 26-09-2019

రైతు రుణమాఫీ రద్దు.. రైతు భరోసా ముద్దు.. అక్టోబర్ 15న ప్రారంభం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైతుభరోసా పథకాన్ని అమలు చేయడం కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రుణమాఫీ బకాయిలను ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం రైతులకు బాకీ పడిన రూ.7,959 కోట్ల బకాయిలకు ఇక మంగళం పాడినట్లే. రైతుల రుణ బకాయిలను రద్దు చేస్తూ, అక్టోబర్ 15 నుంచి తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది.

తాను అధికారంలోకి వస్తే రైతులకు పంట రుణాలను మొత్తంగా చెల్లించేస్తానని, ఏ రైతూ ఇకపై బకాయిలను బ్యాంకులకు చెల్లించవద్దని ప్రచారం చేసి 2014లో అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయుడు చేసిన హామీని మరిచి రుణమాఫీ మొత్తాన్ని తగ్గించడమే కాకుండా దాన్ని కూడా అయిదు విడతలుగా చెల్లిస్తానని వంక పెట్టడంతో ఏపీ రైతులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. 2019 ఎన్నికల ముందు మార్చి 10న మరో విడత రుణమాఫీని అదించాలని బాబు ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసి కూడా దాన్ని చెల్లించలేకపోయింది. 

ప్రస్తుతం ఆ ఆర్డర్‌ని ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం కొట్టివేశారు. అయిదు దఫాలుగా రైతుల పంట రుణాల బకాయిలను చెల్లిస్తానని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వం 2019 మార్చి నాటికి 3 దఫాల బకాయిలను మాత్రమే చెల్లించగలిగింది. మార్చి, నుంచి మే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల టీడీపీ ప్రభుత్వం చివరి బకాయిలను చెల్లించలేకపోయానని వివరించింది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ ఘన విజయంతో అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద  రాష్ట్రం లోని ప్రతి రైతు కుటుంబానికీ రూ. 12,500ల నగదు సహాయం అందిస్తానని ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారమే ఈ ఫథకాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నారు.

అయిదేళ్లలో రైతు రుణాలను విడతలుగా మాఫీ చేస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం 3 దఫాలు మాత్రమే అదీ తగ్గించిన మొత్తాన్ని ఇచ్చి రైతులను దగా చేసిందని వైకాపా ప్రబుత్వం ఆరోపించింది. ఈ నేపధ్యంలో తాను ప్రకటించిన రైతు భరోసా పథకం గత పథకం కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందిని జగన్ ప్రభుత్వం తెలిపింది.

ప్రతి రైతుకూ 1,5 లక్షల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కి సగటు రైతు రుణభారాన్ని రూ.24,500గా లెక్కించింది. ఈ మొత్తాన్ని తాను వడ్డీతో సహా అయిదు కంతులలో చెల్లిస్తానని బ్యాంకులకు తెలిపింది. 

2015-16 నుంచి మూడేళ్లకాలంలో పంటరుణాలపై రూ.14,497 కోట్లను, హార్టీకల్చర్ రుణాలపై రూ.384 కోట్లను చెల్లించిన టీడీపీ ప్రభుత్వం మిగిలిన రూ.10,003 కోట్లను 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అట్టిపెట్టింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ఒక రోజు ముందు నాలుగ, అయిదు ఇన్‌స్టాల్‌మెంట్ల కింద రూ.7,959లను విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసిన టీడీపీ ప్రబుత్వం ఎన్నికల కోడ్ సాకుతో దాన్ని పక్కన పెట్టింది.

అయిదేళ్లలో చెప్పిన మొత్తాన్ని కూడా చెల్లించలేక విఫలమైన టీడీపీ ప్రభుత్వం తన భారాన్ని నూతన ప్రభుత్వంపై ఎలా మోపుతుందని వైకాపా ఆర్థిక, వ్యవసాయ మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, కన్నబాబు ప్రశ్నించారు. తాము చంద్రబాబులా రైతులను దగా చేయలేమని, అందుకే ఇలాంటి తప్పుడు పథకాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రులు తెలిపారు.  టీడీపీ ప్రభుత్వ పథకం కంటే తాము అక్టోబర్ 15 నుంచి ప్రవేశపెట్టనున్న రైతు భరోసా పథకం ఆర్థికపరంగా రైతులకు అధిక మేలుకలిగిస్తుందని వీరు చెప్పారు.

 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle