newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

రైతు భరోసా పథకం లబ్ధిదారుగా విద్యా మంత్రి..

12-10-201912-10-2019 13:35:31 IST
2019-10-12T08:05:31.112Z12-10-2019 2019-10-12T08:05:26.284Z - - 06-12-2019

రైతు భరోసా పథకం లబ్ధిదారుగా విద్యా మంత్రి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్టోబర్ 15 నుంచి రైతుల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనుంది. కానీ శుక్రవారం బయటపడిన ఒక తప్పిదం ప్రభుత్వానికి తలవంపులు తెచ్చినంత పనయింది. ప్రకాశం జిల్లా గణపవరం గ్రామంలో నమోదైన రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితా సాక్షాత్తూ రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు చోటుచేసుకున్నట్లు వెల్లడి కావడంతో అధికారులు హతాశులయ్యారు. ఇది వెంటనే వైరల్ కావటంతోనే విద్యా మంత్రి వివరణ ఇచ్చారు.

తన పేరు రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలోకి ఎక్కినట్లు శుక్రవారమే తన దృష్టికి వచ్చిందని విద్యామంత్రి తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేశానని, సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా ప్రజాప్రతినిధుల పేరు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరినట్లు వారు తెలిపారని, తన పేరు వెంటనే జాబితానుంచి తొలగించినట్లు అధికారులు సమాచార మిచ్చారని మంత్రి తెలిపారు.

ఎంత భూమి ఉందన్నదానితో పనిలేకుండా రాష్ట్రంలోని వ్యవసాయదారులకు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి రూ.12,500లను రాష్ట్ర ప్రభుత్వం అందచేయనుంది. దీంట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకంకింద మూడు వాయిదాల్లో ఇవ్వనున్న రూ. 6,000లు కూడా భాగమే.

నవరత్నాలు పేరిట వైకాపా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన తొమ్మిది కీలక సంక్షేమ పథకాల్లో రైతు భరోసా భాగం.  రైతుభరోసా వెబ్సైట్ ప్రకారం ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తించడానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న భూయజమానుల డేటాబేస్‌ను ఉపయోగిస్తున్నారు.  

ఈ అంశంమీదే విద్యామంత్రి వివరణ ఇచ్చారు. రైతు భరోసా పథకం రైతులకు ఉద్దేశించింది. నేనూ ఒక రైతుని. నాకు భూమి ఉంది. కానీ ఈ పథకం అర్హులైన వారికి మాత్రమే ఉద్దేశించబడింది. అందుకే నా పేరులాగా మరే ప్రజాప్రతినిధుల పేర్లయినా ఈ పథకంలో ఆటోమేటిక్‌గా చేరి ఉంటే వాటన్నింటినీ వెంటనే తొలగించాలని అధికారులకు తెలిపానని మంత్రి చెప్పారు. 

సాఫ్ట్ వేర్ ఆటోమేటిక్‌గా రాష్ట్రంలోని భూ యజమానుల పేర్లన్నంటినీ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలోకి తీసుకుందనేది ఇంత ఆలస్యంగా బయటపడటం ఆశ్చర్యంగా ఉంది. అక్టోబర్ 15 నుంచి అంటే మరొ మూడురోజుల్లో రైతు భరోసా పథకం ప్రారంభమవుతున్నందున ఇలాంటి లోపాలను పరిష్కరించుకుని అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle