newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

రైతు భరోసాలో స్థానిక వైసీపీ నేతల చేతి వాటం?

07-11-201907-11-2019 07:56:17 IST
2019-11-07T02:26:17.088Z07-11-2019 2019-11-07T02:26:12.555Z - - 13-08-2020

రైతు భరోసాలో స్థానిక వైసీపీ నేతల చేతి వాటం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానం.. తన పార్టీ మ్యానిఫెస్టోలో అట్టహాసంగా పెట్టిన పథకమే వైఎస్ఆర్ రైతు భరోసా. ఆ దేవుడి దయతో.. మీ అందరి దీవెనలతో.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏడాది రూ12500 ఇస్తామని వీధి వీధి తిరిగిచెప్పారు. స్థానిక నేతలను, కార్యకర్తలను కూడా రైతన్నలకు జగనన్న మాటగా చెప్పాలని కూడా విన్నపాలు చేసుకున్నారు. నమ్మిన ప్రజలు ఆయననే గెలిపించారు.

మాట తప్పను.. మడమ తిప్పను అని బల్లగుద్ది చెప్పే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ రెండు చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఎన్నికలలో రైతు భరోసాలో కేంద్రం కూడా భాగమని చెప్పలేదు. ఆమాట కొస్తే జగన్ నవరత్నాలను ప్రకటించే సమయానికి కేంద్రం ఆ పథకం పెట్టనేలేదు. కానీ రైతు భరోసాను కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ పథకంను కలిపి వేయి రూపాయలు పెంచుతున్నామనే పూతపూసి భరోసాను మూడు ముక్కలు చేసి అమలు చేస్తున్నారు.

ఈ పథకానికి ఈనెల 15వ తేదీ చివరి గడువు. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ వద్ద కూడా వివరాలు నమోదు కాని రైతులు ఆ గడువులోగా నమోదు చేసుకోకపోతే నగదు బ్యాంకు ఖాతాలలో జమకాదు. ఇందుకోసం వివిధ స్థాయిలలో పరిష్కార కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయా శాఖల వద్ద వివరాలు నమోదు కాని రైతులు మాత్రం వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, మీసేవాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు.

ఈనెల 15 తర్వాత ఒక్క రైతు కూడా పథకం బయట ఉండకూడదని ప్రభుత్వం ఆడంబరంగా ప్రకటించగా గడువులోపు అది అయ్యే పని కాదని నిత్యం ఆయా కార్యాలయాల వద్ద పరిస్థితి అద్దం పడుతుంది. ఈ పథకానికి వెబ్‌ల్యాండ్‌ ఖాతా, ప్రజాసాధికార సర్వేలను కొలబద్దలుగా తీసుకున్నారు. అంటే బ్యాంకు ఖాతాకు, వెబ్ ల్యాండుకు ఆధార్ అనుసంధానమై ఉండి.. ప్రజాస్వాధికారిక సర్వేలో సమగ్ర వివరాలు నమోదై ఉండాలని పెట్టిన షరతులు ఈ పథకంలో కొందరు రైతులకు శాపంగా మారింది.

ఇక ప్రభుత్వం విధించిన షరతులే కొందరు స్థానిక వైసీపీ నేతలకు వరంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డులు, వెబ్ ల్యాండులో ఆధార్ నమోదు కాని ఖాతాలు వేలల్లోనే ఉండగా ఆయా ఖాతాలకు రూ7500 చొప్పున లబ్ది లభించింది. ఆధార్ లింక్ లేని కారణంగా వారి బ్యాంకు ఖాతాలలో మాత్రం నగదు జామకాలేదు. వెబ్ ల్యాండ్ ప్రకారం ఆ భూమిపై భరోసా నగదు జమైనా అది వారి బ్యాంకులకు ఇంకా చేరలేదు.

గ్రామ పంచాయతీలలో భూములు ఉన్నా యజమానులు మరో రాష్ట్రంలో.. మరో జిల్లాలో ఉన్నవారు కొందరైతే.. స్థానికంగానే ఉన్నా సమగ్ర వివరాలు లేని వారూ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇక్కడే కొందరు స్థానిక నేతలు చేతివాటం చూపించి ఆ నగదు సొంత ఖాతాలకు, తమ అనుచరుల ఖాతాలకు మళ్లిస్తున్నట్లుగా కొన్నిచోట్ల ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు రెవెన్యూ కార్యాలయాలలో తమ పరిచయాలను, అధికారాలను వినియోగిస్తున్నారని వినిపిస్తుంది.

రెవెన్యూ ఆన్ లైన్ రికార్డులు వెబ్ ల్యాండ్ లో రైతు ఆధార్ స్థానం ఖాళీ ఉండగా ఆ స్థానంలో తమ ఆధార్ వివరాలను నమోదు చేసి ఈ నగదును మళ్లించుకుంటున్నట్లుగా కొన్ని మండలాలలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆధార్ లింక్ ఉన్న రైతులకు నగదు చేరగా స్థానికంగా రైతులు అందుబాటులోకి రాలేరు అని తెలుసుకున్న స్థానిక నేతలే ఈ తరహా దందాకు తెరతీసినట్లుగా చెప్తున్నారు.

ఇందుకు వెబ్ ల్యాండ్ లో ఆధార్ స్థానంలో నెంబర్ మాత్రమే కనిపిస్తూ పేరు కనిపించకపోవడం వంటి లొసుగులు ఉపయోగపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం.. ఎంతమేర దారితప్పింది అన్నది తెలియాలంటే రెవెన్యూ శాఖల నుండి వివరాలను తెప్పించి సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నిప్పులేనిదే పొగరాదు అంటారు.. మరి ఇక్కడ నిప్పు నిజంగానే ఉందా? లేక కావాలనే పెట్టారో.. ఎంతవరకు తగలబడింది? తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది!

 

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   7 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   8 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   9 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   10 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   10 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   15 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   15 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   16 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   16 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle