newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

14-10-201914-10-2019 08:57:26 IST
Updated On 14-10-2019 12:37:15 ISTUpdated On 14-10-20192019-10-14T03:27:26.878Z14-10-2019 2019-10-14T03:27:17.976Z - 2019-10-14T07:07:15.834Z - 14-10-2019

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల హామీల అమలుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'వైఎస్ఆర్ రైతు భరోసా' పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు.

ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ. 5,510 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. అయితే రైతులు క్రితం చెల్లించాల్సిన బకాయిలకు ఈ డబ్బును జమ చేసుకోవడానికి వీలు లేకుండా బ్యాంకులతో ప్రభుత్వం మాట్లాడింది.

ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన విషయాన్నీ గుర్తుచేశారు. బ్యాంకులకు జగన్ ఆదేశాలు ఇవ్వడంతో రైతులకు వెసులుబాటు కలగనుంది. 

రైతు భరోసా పథకం ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతు భరోసా పథకానికి 50 లక్షల మందికి పైగా అర్హత సాధించారని.. 7 లక్షల మంది కొత్త రైతులు రైతు భరోసాలో పేర్లు నమోదు చేసుకున్నారని, పిఎం కిసాన్ యోజన పధకంలో అర్హత లేని పేర్లు కూడా నమోదైనట్టు మంత్రి స్పష్టం చేశారు. 

ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు.

అనంతరం రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్టోబర్ 15 వ తేదీ రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలుస్తుందన్నారు మంత్రి కన్నబాబు.

వైఎస్సార్ రైతు భరోసా పథకం దేశంలోనే ఓ సంచలనం కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి మండిపడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు.

తాజాగా ఏపీ సీఎం జగన్ రైతుభరోసాను పకడ్బందీగా అమలుచేయాలని చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు రైతు భరోసా పథకంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.84 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు వాటిని రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు.

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle