newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

రైతు బంధువు ఎస్పీవై రెడ్డి అస్తమయం

01-05-201901-05-2019 10:20:14 IST
Updated On 02-07-2019 17:26:54 ISTUpdated On 02-07-20192019-05-01T04:50:14.077Z01-05-2019 2019-05-01T04:49:46.007Z - 2019-07-02T11:56:54.163Z - 02-07-2019

రైతు బంధువు ఎస్పీవై రెడ్డి అస్తమయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నంద్యాల ఎంపీ, రైతు బంధువు, సేవాతత్పరుడు ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్ళు. గత కొంత కాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.

ఎస్పీవైరెడ్డి మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా విశేష సేవలందించారు. నందిపైపుల అధినేతగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఈ దఫా జనసేన తరపున నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ పడ్డారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెంట కర్నూలు జిల్లా నందికొట్కూరు, నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎండ దెబ్బకు గురైన ఆయనకు నెల రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోయింది. ఎంపీ కావడానికి ముందే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రైతు సేవలో ఆయన తరించారు. ఉచితంగా రైతులకు బోర్లు వేయించడం, బావులు తవ్వించడం, పాఠశాలల్లో జరిగే క్రీడలకు అన్నదానం చేయించడం చేశారు.

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రతి పొలంలో బోరు బావులు దర్శనమిస్తాయి. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు పైపులు, మోటార్లు ఉచితంగా అందించారు. రూపాయికే జొన్నరొట్టె, పప్పు, మజ్జిగ, రూ.3లకు కొబ్బరిబొండం పంపిణీ చేశారు. ఎస్పీవై రెడ్డి ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle