newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

రైతుల చెవిలో లగడపాటి ఏం చెప్పారు?

19-05-201919-05-2019 09:23:29 IST
2019-05-19T03:53:29.223Z19-05-2019 2019-05-19T03:53:20.643Z - - 26-08-2019

రైతుల చెవిలో లగడపాటి ఏం చెప్పారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏప్రిల్ 11 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన భారత ఎన్నికల సంఘం మే 23 వరకూ ఫలితాల కోసం వెయిట్ చేయమని అగ్నిపరీక్ష పెట్టింది. దీంతో జనం ఈవీఎంలలో ఏం ఉందో తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి శనివారం అమరావతిలో సందడి చేశారు. అనుకోకుండా మీడియా ముందుకు వచ్చారు.

ఆయన ఏవైనా ఎగ్జిట్ పోల్స్ లీక్ లు ఇస్తారేమోనని మీడియా తెగ హైరానా పడిపోయింది. అయితే ఆయన మాత్రం చాలా తాపీగా అసలు విషయం చెప్పారు. ఎలాంటి లీకులు తాను చెప్పదలుచుకోలేదని, అమరావతి రైతులకు మాత్రం చెవిలో రహస్యం చెప్పేశానని విక్రమార్కుడి కథ లాంటిది ఒకటి వినిపించారు. నిజం చెప్పకపోతే తల వేయి వక్కలవుతుందనేవారు లేరు కాబట్టి ఆయన ఏం చెప్పినా వినాల్సిందే. 

అయితే చూచాయగా ఆయనమాత్రం తెలంగాణలో కారు జోరు ఉందని, ఏపీలో సైకిల్ ప్రయాణం బాగా సాగుతుందని హింట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, గజిబిజిగా తీర్పు ఇవ్వలేదని గుర్తుచేశారు.

మీడియా సమావేశంలో ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉండబోతుందనే అంశంపై తన అంచనాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని, ఆదివారం సాయంత్రం తన ఫ్లాష్ టీం తయారుచేసిన ఎగ్జిట్ పోల్స్ తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంది గనకే అక్కడి ప్రజలు కారెక్కారని, లోటు బడ్జెట్‌లో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సైకిలే మార్గమైందని వ్యాఖ్యానించారు. తాను తన అంచనాలను మాత్రమే వెల్లడిస్తున్నాని, ఎగ్జిట్ పోల్స్ 100 శాతం ఎక్కడా నిజం కాదన్నారు. తెలంగాణలో ఆయన అంచనాలు తప్పిన సంగతి తెలిసిందే. అయితే 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పగా, 2 మాత్రమే గెలిచారు. మిగిలిన 8మంది రెండవ స్థానంలో వచ్చారని లగడపాటి వివరించారు. 

తన ఫ్లాష్ టీంకి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ టీం వివరాలు సిద్ధం చేస్తోందన్నారు. లగడపాటి ఫ్లాష్ టీం ఎగ్జిట్ పోల్స్ కోసం జనం ఎదురుచూస్తున్నారని, ఈసీ నిబంధనల ప్రకారం ఆదివారం సాయంత్రమే వివరాలు వెల్లడి చేస్తానన్నారు. రైతులకు ఏం చెప్పారని అడిగితే మాత్రం అదంతా సీక్రెట్ అంటున్నారు లగడపాటి.

అయితే, లగడపాటి తీరుపై వైసీపీ మండిపడింది. చంద్రగిరిలో రీపోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు.

అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి లగడపాటి ఈ విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రీపోలింగ్‌లో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వే పేరుతో ఏపీ అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయంటూ లగడపాటి రాజ్‌గోపాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ కాదు... ఇది ఎల్లో జలగ! అంటూ విజయసాయిరెడ్డి  ట్వీట్‌ చేశారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle