newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

‘‘రైతుల కంట కన్నీరు మంచిదికాదు’’

04-01-202004-01-2020 16:31:50 IST
2020-01-04T11:01:50.907Z04-01-2020 2020-01-04T11:01:49.144Z - - 22-01-2020

‘‘రైతుల కంట కన్నీరు మంచిదికాదు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతిపై కక్ష కట్టి రాజధాని తరలింపు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు. రాజధాని రైతుల ఇళ్లలో పోలీసుల సోదాలపై లోకేష్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. అమరావతి రైతులు, మహిళలపై జగన్‌కి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదని విమర్శించారు. రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేసి ఏమి సాధించాలని చూస్తున్నారని ప్రశ్నించారు. 

అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలేంటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్‌ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇటు ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మూడు రాజధానుల ప్రకటన సరైనది కాదన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని రాయపాటి డిమాండ్ చేశారు. అమరావతిని కులానికి పరిమితం చేయడం సరికాదన్నారు. ఒకే వర్గానికి సంబంధించిన రాజధాని అనడం అవివేకమన్నారు. గత ముప్ప సంవత్సరాల నుండి తాడికొండ ఎస్సీ రిజర్వు నియోజకవర్గమన్నారు.విశాఖపట్నంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసేందుకే రాజధాని తరలించాలని ప్రయత్నిస్తున్నారని రాయపాటి ఆరోపణలు చేశారు.

సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ విశాఖపట్నంలో భూములు కొనుగోలు చేసేందుకు తిరుగుతున్నారని, విశాఖపట్నంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోందన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధాని పెట్టాలనుకోవడం తప్పన్నారు. రాష్ట్ర ఆర్థిక సరిస్థితి నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి అది ఆటంకం అవుతుందన్నారు. రాజధానులు తరలిస్తే అభివృద్ధి జరగదని పరిశ్రమలు స్థాపించి, యువతకు ఉపాధి కల్పించాలన్నారు. డబ్బులున్నవాళ్లు భూములు కొంటే తప్పేముందని రాయపాటి అన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle