newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

రైతన్న నిలువుదోపిడీ.. నెల్లూరు అన్నదాతల ఆక్రందన

25-02-202025-02-2020 08:19:26 IST
2020-02-25T02:49:26.993Z25-02-2020 2020-02-25T02:49:22.620Z - - 07-04-2020

రైతన్న నిలువుదోపిడీ.. నెల్లూరు అన్నదాతల ఆక్రందన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భూమిని దున్ని, నారుపోసి. నీరుపెట్టి, కుప్పనూర్చి ధాన్యాన్ని అమ్మకానికి పెట్టిన అన్నదాత నిలువునా మోసానికి గురవుతున్నాడు. నెల్లూరు జిల్లాలో చెన్నై, తెలంగాణ, కర్ణాటక వ్యాపారులు పాగా వేసి నిలువునా దోపిడీకి పాల్పడుతున్నారు. తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. ప్రకృతి కరుణించక పోవడంతో దిగుబడి తగ్గి వారంతా దిగాలు పడుతున్నారు. ఈ ఏడాది కరువు తీరా పంటలు పండుతాయని రైతులు ఆశపడ్డారు. వరి పంటతో తాము చేసిన అప్పులు తీరిపోతాయని రైతులు సంబరపడ్డారు. కానీ నెల్లూరు జిల్లాలో రైతులకు సీన్ రివర్స్ అయ్యింది. గిట్టుబాటు ధర దక్కక దోపిడీకి గురవుతుండటం ఓ ఎత్తయితే, వ్యాపారుల సిండికేట్‌ వ్యవహారంతో ధాన్యాన్ని లాభానికి అమ్ముకోలేక అవస్థ పడుతుండటం అధ్వానంగా మారింది.నెల్లూరు జిల్లాలోని రైతులకు ఈ పరిణామం శరాఘాతంగా మారుతోంది. 

జిల్లాలో నాలుగేళ్ల పాటు వరుస కరవు కష్టాలు అనుభవించిన రైతులకు గతేడాది జలసిరులు ఉత్సాహాన్ని నింపాయి. దీంతో ఆనందంగా సాగుచేపట్టారు. చాలా కాలం తరవాత విస్తారంగా వరినాట్లు వేశారు. అకాల వర్షాల సమస్యను తట్టుకుంటూ ఆ పంట ప్రస్తుతం చేతికొస్తోంది. ఎటుచూసినా కోతల హడావుడితో సందడి వాతావరణం నెలకొంటోంది. అయితే, ఈ ఆనందం వెనుక రైతుకు కన్నీటి తడి కనిపిస్తోంది. భారీగా నష్టపోయాం.... చాలా బాధగా ఉంది అంటు వరి రైతులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.

ఈ ఏడాది 50 ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేపట్టామని, అకాల వర్షాల వల్ల సమస్యా, వాతావరణ ఇబ్బందులా అనేది అర్థం కావడం లేదు కానీ దిగుబడి సగానికి పడిపోయిందంటున్నారు. బీపీటీలు ఎకరాకు 20 బస్తాలు అవుతున్నాయి. వేరే రకాలు 17-18 బస్తాలు అవ్వడం కష్టంగా కనిపిస్తోంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకో అర్థం కావడం లేదు. ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చు అయింది. బస్తా రూ.1100 నుంచి రూ.1200కీ అడగడం లేదు. ఆదాయం కాదు కదా.. చివరకు ఎకరాకు రూ.15వేలు నష్టం వస్తోంది.

ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో 35 బస్తాలకు తగ్గలేదు. 50 వరకు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. విత్తనమైతే మంచిదే. దీనికితోడు ధరలేకుండా పోయింది. ప్రభుత్వం తరఫున కొనడం లేదు. అప్పుల వల్ల దాచుకోలేక ఎంతోకొంతకు ఇచ్చేస్తున్నాం. చెన్నైకు చెందిన వ్యాపారులు వచ్చి కొంటున్నారు. వాళ్లూ నెమ్ములని బస్తాకు 3 కిలోలు తరుగు తీసేస్తున్నారు. గోతాముతో కలిపి అది 4 కిలోలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘‘9 ఎకరాల్లో నెల్లూరు జిలకర రకం వరి సాగుచేశామని, ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి ఖర్చు అయింది. మాకు దిగుబడి అయితే ఎకరాకు 40 బస్తాలు వచ్చింది కానీ ధరలు మాత్రం లేవు. అధ్వాన పరిస్థితి ఉంది. బస్తా ధాన్యాన్ని రూ.1040కి అడుగుతున్నారు. ఈ లెక్కన ఇచ్చేస్తుంటే కనీసం పెట్టుబడులకూ రావడం లేదు. చివరకు తరుగు 3 కిలోలు, గోతాము కిలో.. మొత్తం నాలుగు కిలోలు ఇచ్చేస్తున్నా. ఏం చేస్తాం.. దాచిపెట్టాలంటే అవకాశం లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో అన్న భయంతో నష్టమని తెలిసినా మిన్నకుండిపోతున్నాం.

ఇక, కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటే ధాన్యాన్ని ఆరబెట్టాలి. పట్టల బాడుగ, రవాణా ఖర్చులు అన్నీ తడిసి మోపెడవుతున్నాయి. వాళ్లు చెప్పినట్లు చేసి ఇవ్వాలంటే మాలాంటి రైతులకు కచ్చితంగా నష్టమే. అందుకే బయటి వ్యాపారులకు సగానికి ఇచ్చేస్తున్నాం.’’  అంటు రైతులు తమ బాధను మీడియా ముందు చెబుతున్నారు..

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వరికోతలు చేస్తున్న రైతుల ఆవేదన మిగులుతోంది. గతంతో పోల్చితే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతుండటంతో ఆవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు పండిన పొలంలో ప్రస్తుతం 20-25 బస్తాలు రావడం గగనంగా మారింది.

ఎక్కడో ఒకరిద్దరికి మాత్రం 35-40 బస్తాలు దిగుబడి వస్తోంది. నెల్లూరు జిలకరలు 25-35 బస్తాల మధ్యన వస్తుండగా.. బీపీటీలు 20-30 బస్తాలకే పరిమితమవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఓవైపు దిగుబడి అమాంతం తగ్గిపోతుండగా, మరోవైపు ధర లేకపోవడం, తరుగు పేరుతో వ్యాపారుల వేధింపులు మరో సమస్యగా మారాయి. బస్తా రూ.వెయ్యి పలకడం గగనంగా మారింది. మద్దతు ధర రూ.1300 వరకు ఉన్నప్పటికీ దళారులు దాన్ని దాచిపెట్టేస్తున్నారు. దీనికితోడు, నెమ్ముల పేరుతో ధాన్యంలో తేమశాతం సాకుగా చూపి అదనంగా నొక్కేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 100 బస్తాల ధాన్యం కొంటే అందులో 400 కిలోల మేర వ్యాపారికి లాభం దక్కుతోంది. దీనికితోడు గిట్టుబాటు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోతుంటే వ్యాపారుల జేబులు మాత్రం నిండిపోతున్నాయి. 

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   16 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle