newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

రేషన్ డీలర్ల ప‘రేషాన్’ .. భవిష్యత్తుపై టెన్షన్?

22-07-201922-07-2019 09:06:02 IST
Updated On 22-07-2019 09:06:30 ISTUpdated On 22-07-20192019-07-22T03:36:02.019Z22-07-2019 2019-07-22T03:35:48.261Z - 2019-07-22T03:36:30.500Z - 22-07-2019

రేషన్ డీలర్ల ప‘రేషాన్’ .. భవిష్యత్తుపై టెన్షన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో  ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రేషన్ డీలర్లు తమ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల జగన్ చేసిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 1 నుంచి నూతన విధానంతో రేషన్ డీలర్లతో పనిలేకుండా గ్రామవాలంటీర్ల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ పథకాలతో పాటు పెన్షన్లు, నిత్యావసరాలు హోం డెలివరీ జరుగుతుందని జగన్ ప్రకటించడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. 

Image result for AP Ration dealers protest

ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయంతో  రేషన్ డీలర్లు తమ పరిస్థితి ఏంటిని ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రేషన్‌షాపును నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని తమ కడుపు కొట్టద్దని వారంతా వేడుకుంటున్నారు.

తాజా పరిణామాల  నేపథ్యంలో తమ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తోంది. ఈమధ్య విశాఖ వెళ్ళి శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్రస్వామికి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. 

వాలంటీర్ల నియామకాల్లో రేషన్‌ డీలర్లను భాగస్వాములు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జీవనోపాధి కోసం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ రోజు పౌరసరఫరాశాఖ మంత్రి, కమిషనర్‌తో రేషన్ డీలర్ల సంఘం నేతలు సమావేశం కావాలని నిర్ఱయించారు.

మరి రేషన్ డీలర్లు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయంశంగా మారింది. వాలంటీర్ల నియామకాల్లో వారిని భాగస్వాములు చేస్తుందా.. లేదా వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుందా ? అనేది తేలాల్సి ఉంది.

మరోవైపు, రేషన్ డీలర్లను తొలగించే అంశంపై పౌర సరఫరాలశాఖ అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఏపీలో 30వేలమంది వరకూ రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది 50 ఏళ్లకు పైగా సేవలందిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వారికి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి పని చేయిస్తోంది. కార్డుదారులకు పంపిణీ చేసే సరుకులపై ఇచ్చే కమిషన్ ఆధారంగా వీళ్లు జీవిస్తున్నారు. తమకు గౌరవ వేతనం ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 

ఈ డిమాండ్ అలా ఉండగానే ఈ వ్యవస్థనే ఎత్తివేయాలి నిర్ణయించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని నిర్ణయించారు.

ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రతీ జిల్లాకు కనీసం జిల్లాకు 10 నుంచి 13 లక్షల సంచులు అవసరం. ఇందు కోసం 8 నుంచి 10 ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ 1 లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle