newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

రేపు నన్నూ అరెస్టు చేస్తారేమో... బాబు భయం!

08-04-201908-04-2019 12:38:49 IST
Updated On 08-04-2019 17:51:26 ISTUpdated On 08-04-20192019-04-08T07:08:49.887Z08-04-2019 2019-04-08T07:08:48.233Z - 2019-04-08T12:21:26.118Z - 08-04-2019

రేపు నన్నూ అరెస్టు చేస్తారేమో... బాబు భయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలు స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియపై  ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు సూచిస్తున్నాయి. ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైజాగ్‌లో చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ముందుగా కలెక్టర్లను మార్చారు, ఎస్పీలను మార్చారు. ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎస్‌ను కూడా మార్చారు. రేపోమాపో నన్ను కూడా అరెస్టు చేస్తారేమో... అని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అయినా తానెప్పుడూ అరెస్టులకు భయపడబోనని ఆత్మగౌరవంతో నిలబడతాను తప్ప మోడీ ప్రభుత్వానికి లొంగిపోనని ప్రకటించారు.  చంద్రబాబు వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలతో పాటు తెలుగుదేశం కార్యకర్తల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. 

మోడీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే ఈసీ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా మోదీ జేబులో బొమ్మగా మారిపోయారని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని వారంతా మండిపడుతున్నారు. దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయని...అయినాఏపీలో అధికారులను మాత్రమే ఎందుకు బదిలీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు విభేధించారని ....కానీ ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ చరిత్ర ఎన్నడూ లేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తమ పార్టీ అధినేతే తనను అరెస్టు చేస్తారని బహిరంగంగా ప్రకటించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కలవరం పుట్టిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle