newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్

07-12-201907-12-2019 13:09:22 IST
Updated On 07-12-2019 13:12:42 ISTUpdated On 07-12-20192019-12-07T07:39:22.726Z07-12-2019 2019-12-07T07:39:19.122Z - 2019-12-07T07:42:42.140Z - 07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్ దిశ అత్యాచారం.. హత్యోదంతంతో దేశం మరొక్కసారి ఉలిక్కిపడింది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష వేసి చంపేస్తేనే సమంజసమని పౌరులు తేల్చేశారు. పోలీసులు విచారణ.. వాళ్ళకి శిక్ష.. సమయం వృధా.. ప్రభుత్వానికి భారమే తప్ప సరైన శిక్ష కాదని పోలీసులు ఎన్ కౌంటర్ చేసేశారు. దానికి పోలీసులు వాళ్లకున్న పరిమితులతో అల్లిన కథ కూడా అందరికీ తెలిసిందే.

అయితే నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ మీద దేశవ్యాప్తంగా అభినందనలతో పాటు మరికొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక్క దిశ విషయంలోనే ఇలా ఎన్ కౌంటర్ ఎందుకు ఇలాంటి అన్ని కేసులలో కూడా నిందితులకు మరణశిక్ష వేయగలరా? అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు శిక్షలలో కూడా ఆర్థిక, సామజిక అసమానతలు ఉంటాయా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఇందులో ముఖ్యంగా నేషనల్ మీడియా అయితే ఏకంగా దేశంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులతో పాటు వారి పిల్లలు.. బంధువులు.. సమాజంలో పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు, పారిశ్రామిక వేత్తలు, వారి పిల్లలు.. వాళ్లపై ఉన్న అఘాయిత్యాల కేసులను బయటకు తీసింది. దిశ నిందితుల మాదిరే ఆయా కేసులలో నిందితులకు కూడా ఎన్ కౌంటర్ చేసే దమ్ము పోలీసులకు ఉందా? అంటూ సూటి ప్రశ్నలు వేస్తుంది.

సామాన్య ప్రజలకే చట్టాలను మించి కూడా శిక్షలు వేసే మన వ్యవస్థలో ఆ చట్టాలను చేసే నేతలే తప్పుచేస్తే శిక్షలు ఉండవా? అంటూ ఘాటుగా స్పందిస్తుంది. దిశ నిందితులను శిక్షించడంలో ఎంత మాత్రం తప్పుబట్టని మీడియా దిశ మాదిరే ఎందరో అభాగ్యుల జీవితాలను పాడుచేసిన నేతలకు కూడా ఎందుకు శిక్షలు పడవంటూ తీవ్రంగా విరుచుపడింది. నేషనల్ మీడియా నేతల లిస్టులో మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంతకు ముందు పోలీస్ అధికారి. ఆ సమయంలో ఆయన మీద ఎన్నో ఆరోపణలున్నాయి. అందులో ఓ మహిళ తనపై సీఐ రాంమాధవ్ అత్యాచారం చేయబోయారనే కేసు కూడా ఒకటి. అప్పట్లో ఓ కేసులో ఓ యువజంటను అదుపులోకి తీసుకున్న మాధవ్ ఆ జంటలోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేయబోయారని కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో ఉంది.

ఈ కేసు ఎన్నికల సమయంలో తన వీఆర్ఎస్ ఆమోదానికి అడ్డంకి కాగా మాధవ్ కోర్టుకెళ్లి మరీ ఆమోదం తెచ్చుకున్నారు. అయితే ఈ కేసు ఇప్పటికీ ఇంకా తేలలేదు. కాగా ఇప్పుడు నేషనల్ మీడియా అత్యాచార కేసులున్న నేతల జాబితాలో మాధవ్ పేరు కూడా ఉండడంతో

ఎంపీ గోరంట్ల మాధవ్ ను కూడా ఏపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేయగలరా అని ప్రశ్నిస్తుంది. ఒక్క మాధవ్ మాత్రమే కాదు దేశంలో అత్యాచార కేసులలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కాల్చిపారేసే దమ్ము మన దేశవ్యవస్థలకు ఉందా అని తీవ్రంగా విరుచుకుపడింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle