newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

10-12-201910-12-2019 11:08:18 IST
Updated On 10-12-2019 13:17:10 ISTUpdated On 10-12-20192019-12-10T05:38:18.302Z10-12-2019 2019-12-10T05:38:15.951Z - 2019-12-10T07:47:10.973Z - 10-12-2019

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో ఎవరైనా సరే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందనఅన్నారు. ఇద్దరు ఆడపిల్లలున్న తండ్రిగా దిశ తల్లిందండ్రుల బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’  ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి  అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలు నన్ను కలిచివేశాయి. దీన్ని మార్చాలనే తాపత్రయమే ఈ రోజు చట్టసభలో ఏం చేస్తే... మార్పులు తీసుకు రాగలుగుతామని ఆలోచనతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. హైదరాబాద్‌లో దిశ ఉదంతం తీసుకుంటే ఇది నిజంగా సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన. ఆ వైద్యురాలు టోల్‌గేట్‌ వద్ద ఉండగా బండికి పంక్చర్‌ చేసి, దాన్ని రిపేర్‌ చేయిస్తామని నమ్మించి అత్యాచారం చేసి, కాల్చేసిన ఘటన మన కళ్ల ముందే కనబడుతుంది. ఇలాంటి  దారుణాలపై పోలీసులు, రాజకీయ నాయకులు ఎలా స్పందించాలని ఆలోచన చేస్తే... నిజంగా బాధ అనిపించింది. 

ఇలాంటి సంఘటనే మన రాష్ట్రంలో జరిగితే..మనం ఎలా స్పందించాలి. ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డవారిని కాల్చేసినా కూడా తప్పులేదని అందరూ అనుకున్నారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నాకు చెల్లెలు ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక తండ్రిగా ఎలా స్పందించాలి. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు.

జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది.  ఏదైనా జరిగితే బాధిత కుటుంబాలకు కావల్సింది వెంటనే ఉపశమనం. అలా తమకు సత్వర న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని కాల్చేయాలని అనుకోరు. జరుగుతున్న జాప్యం చూసినప్పుడు... సంవత్సరాలు తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదనే బాధ వారిని కలిచివేస్తోంది. 

అందుకనే ఇవాళ చట్టాలు మారాలి. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్‌ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు... దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు ఉన్నట్టుగా... కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచనలు చేయాలి. కొన్ని కొన్ని దేశాల్లో అయితే కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి.

సంఘటన జరిగిన వారం రోజుల్లోపు విచారణ పూర్తికావాలి, ఈలోపు డీఎన్‌ఎ రిపోర్టుల్లాంటివి పూర్తికావాలి, 2 వారాల్లోపు విచారణ పూర్తికావాలి, 3 వారాల్లోపు దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితిలోకి రావాలి. లేకపోతే ఎవ్వరికీ సంతృప్తి ఉండదు. చాలా వేగంగా కేసుల విచారణ పూర్తి కావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప .. వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది.  ఒక అన్నగా, భర్తగా, ఇద్దరు పిల్లల తండ్రిగా రేపిస్టులను కాల్చి చంపాలనే తాను అనుకుంటానని కానీ రేపిస్టుల వథపై కొంతమంది ఎందుకంత గావుకేకలు పెడుతున్నారో అర్థం కాలేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కూడా నాకు అర్థం కావడంలేదని జగన్ చెప్పారు.

అసలు మనిషి ఎప్పుడు రాక్షసుడు అవుతాడు, తన ఇంగితాన్ని ఎప్పుడు కోల్పోతాడని ఆలోచిస్తే.. తాగితే ఈరకంగా తయారవుతాడు. అలాంటిది ఐదారుగురు మనుషులు కూర్చుని తాగితే మృగాలవుతారు. అందుకే పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ షాపులు రద్దు చేశాం.  గ్రామాల్లో 43వేల బెల్టుషాపులను రద్దుచేశామని గర్వంగా చెప్తున్నాం. ఎన్ని నిషేధాలు ఉన్నా ఫోర్నోగ్రఫీని కట్టడిచేయలేని పరిస్థితి. పోర్న్‌ సైట్లను బ్లాక్‌ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో మరో విప్లవాత్మక బిల్లును తీసుకువస్తాం.’ అని తెలిపారు.

ఇందుకోసం ప్రభుత్వం అందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు కోరుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగారిని సలహా ఇవ్వమని అడిగాం. కాని సలహా ఇవ్వడం తప్ప.. ఏ విధంగా విమర్శించాలో అన్ని విమర్శలూ చేశారు. ఉద్దేశాలు ఏమైనా... కూడా వాస్తవాల్లోకి మనం పోవాల్సి ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

యావత్‌ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌, సినీ నటి విజయశాంతి అభినందించారు. ‘వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి పడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   34 minutes ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   44 minutes ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   an hour ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   an hour ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle