newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

రెండు రివర్ల ‘రివర్స్’ టెండరింగ్-2

06-07-201906-07-2019 10:42:38 IST
Updated On 06-07-2019 10:53:47 ISTUpdated On 06-07-20192019-07-06T05:12:38.988Z06-07-2019 2019-07-06T05:12:37.485Z - 2019-07-06T05:23:47.119Z - 06-07-2019

రెండు రివర్ల ‘రివర్స్’ టెండరింగ్-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

సొంత రాష్ట్రంలో ప్రవహించే నదులు కనుక ఎవరికీ అభ్యంతరాలు, ఎటువంటి అనుమతులు, ఎలాంటి అవరోధాలు లేకుండా ఏపీ ప్రభుత్వం దీన్ని సాకరం చేయగలిగింది. దీన్నే ‘మహా సంగమం’గా పదేపదే చెప్పుకుంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదాలు ముదిరి ఉద్రిక్తతలు తలెత్తడం, ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు కృష్ణానది నీళ్లు రావడమే గగనమైపోయిన నేపథ్యంలో ఈ ‘పట్టిసీమ’ జలాలే కృష్ణా డెల్టాకు దిక్కయ్యాయి. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతున్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణాకు వర ప్రదాయినిగా చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ఆఘమేఘాల మీద దాని నిర్మాణాన్ని కొంత మేర పూర్తిచేసి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్ సమక్షంలో దాన్ని ప్రారంభించారు కూడా. ‘పూర్తి చేయని ప్రాజెక్టుకు అట్టహాసంగా చేస్తున్న ప్రారంభోత్సవం’ అని విపక్షాలు చేసిన విమర్శలను కేసీఆర్ అస్సలు ఖాతరు చేయలేదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరువాత కూడా టీఎస్ ముఖ్యమంత్రి స్థిమితంగా కూర్చోలేదు. వెనువెంటనే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాన్ పేపర్లని ముందు పరచుకుని దానిపై పడ్డారు. ఏపీ సీయంతో ఇప్పటికే ఈ అంశంపై తొలి విడత ప్రాథమిక చర్చల్ని ముగించిన కేసీఆర్, ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికల్ని స్వల్ప వ్యవధిలో సిద్ధం చేయించి మరోసారి భేటీకి సమాయత్తం అవుతున్నారు. 

కేసీఆర్ చేసిన నదుల అనుసంధానం ప్రతిపాదనపై జగన్మోహన్‌రెడ్డి స్పందనేంటి? ఆసలు ఆయన ఏమనుకుంటున్నారు? దిగువన గల తన సొంత రాష్ట్రానికి రావాల్సిన గోదావరి వరద జలాల్ని నీటి ప్రవాహ దిశ మార్చి ఎదురు తీసుకెళ్లి శ్రీశైలానికి మళ్లించాలన్న ప్రతిపాదనకు ఆయన ఎందుకు తల ఊపారు.? ఇది ఎంతవరకు ఏపీకి శ్రేయోదాయకం? దీనిపై స్పందించాల్సిన టీడీపీ నేతలు ఎందుకనో మౌనంగా ఉండిపోయారు. 

ఎన్నికల్లో పరాజయానికి కారణాలు వెతికే పనిలో వారి బిజీలో వారు ఉండిపోయి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ‘బృందగానం’పై మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు. రాష్ట్రానికి జీవనాడిగా చెప్పే పోలవరం ప్రాజెక్టునే ‘ఇది కేంద్రం బాధ్యత’ అని తొలినాళ్లలో తన మనసులో మాట బయట పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ‘నదుల అనుసంధానం’ అనే లక్ష కోట్ల భారీ ప్రాజెక్టును తలకెత్తుకోవడమే ఆశ్చర్యమని విశ్లేషకుల మాట.

గతంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నే వద్దన్న వైసీపీ నేత ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితులలో ఇంత భారీ వ్యయ ప్రయాసలతో కూడిన ప్రతిపాదనకు అంగీకరించి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మలివిడత చర్చలకు సిద్ధంకావడం ఇప్పటికైతే అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది.

రెండు రివర్ల ‘రివర్స్’ టెండరింగ్-1


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle