newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

రెండు రివర్ల ‘రివర్స్’ టెండరింగ్-1

06-07-201906-07-2019 10:39:56 IST
Updated On 06-07-2019 11:55:29 ISTUpdated On 06-07-20192019-07-06T05:09:56.951Z06-07-2019 2019-07-06T05:09:54.998Z - 2019-07-06T06:25:29.627Z - 06-07-2019

రెండు రివర్ల ‘రివర్స్’ టెండరింగ్-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక మంత్రం ‘నదుల అనుసంధానం’. గోదావరి జలాల్ని శ్రీశైలం వరకు తీసుకెళ్లి నెర్రెలిచ్చిన తెలంగాణా, సీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ఉభయ రాష్ట్ర పాలకులు ఒకే గొంతుకగా చెప్పడం సరికొత్త చర్చను లేవనెత్తింది. ముఖ్యంగా ఏపీలో ఏ నలుగురు చేరి మాట్లాడుకున్నా ‘శ్రీశైలానికి గోదావరి నీళ్లు’ అనేదే హాట్ టాపిక్‌గా ఉంది. 

రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ ఇంత తేలికా? 

రెండు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయాక ‘ఉమ్మడి ప్రయోజనార్ధం’ అనే మాటకు విలువ ఉంటుందా? ‘అరమరికలు లేని స్నేహంతో కూడిన పరస్పర సహకార సామరస్య ధోరణి’ దీర్ఘకాలం నిలుస్తుందా? అసలు రెండు రాష్ట్రాల మధ్య కొత్తగా చిగురించిన స్నేహం ఎవరి ప్రయోజనాలకు? ఇందులో ఎవరి వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు అందరి మెదళ్లనూ తొలుస్తున్న సందేహాలు.

ఒక నది నీటిని తీసుకెళ్లి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో నదికి మళ్లించాలన్న ఆలోచన నిజంగా మహత్తరం. కాకపోతే, వేర్వేరు రాష్ట్ర భూభాగాల్లో ప్రవహిస్తున్న రెండు నదుల్ని అనుసంధానం చేయాలనుకోవడమే పెద్ద సాహసం.

ఒక జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఈ తరహా బృహత్తర ప్రాజెక్టును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా చేపట్టాలని పూనుకోవడం అంత శ్రేయస్కరం కాదని ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం. ఇది అంత సులభ సాధ్యమని అనుకోవడం లేదని వారి వాదన. 

నిజానికి ‘నదుల అనుసంధానం’ అనేది ఒక జాతీయ సంకల్పం. దేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు అనేక దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా ఈ నినాదం మాత్రం అలానే ఉండిపోయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కంటే ముందే దాని ఫలాల్ని అందుకోవాలని భావించి ‘పట్టిసీమ’ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. దాన్నే దేశంలో ‘తొలి నదుల అనుసంధానం’గా పెద్దఎత్తున ప్రచారం కూడా చేసుకుంది.
(ఇంకా ఉంది)

రెండు రివర్ల ‘రివర్స్’ టెండరింగ్-2


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle