newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

రెండు నెల‌ల్లోనే బీజేపీలో ఇంత మార్పా..?

25-07-201925-07-2019 08:07:59 IST
Updated On 25-07-2019 10:40:25 ISTUpdated On 25-07-20192019-07-25T02:37:59.847Z25-07-2019 2019-07-25T02:37:47.837Z - 2019-07-25T05:10:25.424Z - 25-07-2019

రెండు నెల‌ల్లోనే బీజేపీలో ఇంత మార్పా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎద‌గ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌క్కా ప్రణ‌ళిక ప్ర‌కారం వెళుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ నేత‌ల వ్యాఖ్య‌లు చూస్తుంటే బీజేపీ ఎంత ప‌క్కాగా రాజ‌కీయాల‌ను ప్లాన్ చేసుకుంటోందో అర్థం అవుతుంది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే నానుడిని బీజేపీ నేత‌లు బాగా ఒంట‌బ‌ట్టించుకున్నారు. రెండు నెల‌ల్లో రాష్ట్రంలో త‌మ రాజ‌కీయ వైఖ‌రిని పూర్తిగా మార్చేసుకున్నారు.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నాలుగేళ్ల త‌ర్వాత తెగ‌దెంపులు చేసుకుంది. ఏకంగా బీజేపీని శ‌త్రువుగా భావించి క‌య్యానికి దిగింది. దీంతో గ‌త ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు స‌హ‌క‌రించింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యమే. ఎన్నిక‌ల‌కు ముందు సంవ‌త్స‌రం పాటు పార్టీలు వేరైనా వైసీపీది, బీజేపీది ఒకే మాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హారం సాగింది. మొత్తంగా ఎన్నిక‌ల్లో బీజేపీ ల‌క్ష్యం నెర‌వేరింది. టీడీపీ అధికారంలోకి రాలేదు.

టీడీపీ చ‌రిత్ర‌లో లేనంత దారుణంగా ఓట‌మిపాల‌వ్వ‌డంతో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పెద్ద‌లు భావించారు. అనుకున్న‌ట్లుగానే టీడీపీని దెబ్బ‌తీసేలా ఆ పార్టీ నుంచి న‌లుగురు ఎంపీలు, ఇత‌ర నేత‌ల‌కు కాషాయ కండువా కప్పేశారు. దీంతో అంతా ప్ర‌స్తుతం బీజేపీ టార్గెట్ టీడీపీనే అని అనుకున్నారు. కానీ, ఏ లెక్క‌లు వేసుకున్నారో కానీ అనూహ్యంగా బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది.

కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని భావిస్తున్న వైసీపీకి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేలా లేదు. బీజేపీ నేత‌లు వైసీపీపై విమ‌ర్శ‌ల దాడి పెంచుతున్నారు. వైసీపీ అరాచ‌కాలు చేస్తోంద‌ని బీజేపీ అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించ‌గా, ప్ర‌త్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను వైసీపీ మోసం చేస్తోంద‌ని ఆ పార్టీ కీల‌క నాయ‌కురాలు పురందేశ్వ‌రి విమ‌ర్శిస్తున్నారు. వీరి విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా తాజాగా బీజేపీ ముఖ్య‌నేత‌, రాష్ట్రంలో పార్టీ వ్య‌వ‌హారాలు చూస్తున్న రాంమాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ పాల‌న‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. పెనం మీద నుంచి పొయిలో ప‌డ్డ‌ట్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప‌రిస్థితి మారింద‌ని అన్నారు. వైసీపీ పాల‌న చూసి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. భ‌విష్య‌త్ అంతా త‌మ‌దేన‌ని చెప్పారు. కేవ‌లం రెండు నెల‌లు కూడా పూర్తిగా పాలించ‌ని వైసీపీ ప్ర‌భుత్వంపై రాంమాధ‌వ్ ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారంటు రానున్న రోజుల్లో ఇది మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

ప్ర‌స్తుతం వైసీపీ నుంచి టీడీపీలో చేరే వారు ఎవ‌రూ లేరు. వైసీపీపైన గ‌ట్టిగా పోరాడితే టీడీపీ నేత‌లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపడంతో పాటు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నేది బీజేపీ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఇక‌, బీజేపీ నేత‌ల మాట‌లు ఇలా ఉంటే.. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ఒక మ‌తానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని వెనుక కూడా బీజేపీ ఉందా అని భావిస్తున్నారు. మొత్తంగా ఏ ప్రాంతీయ పార్టీల‌ను న‌మ్ముకోకుండా అన్ని రాష్ట్రాల్లో స్వంతంగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ ఏపీలో పెద్ద స్కెచ్‌తోనే ఉంది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle