newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

రూ.60 కేజీ ఉల్లి రూ.25 కే.. బంపరాఫర్ ప్రకటించిన సీఎం..!

29-09-201929-09-2019 09:14:03 IST
2019-09-29T03:44:03.321Z29-09-2019 2019-09-29T03:44:01.654Z - - 24-02-2020

రూ.60 కేజీ ఉల్లి రూ.25 కే.. బంపరాఫర్ ప్రకటించిన సీఎం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశ వ్యాప్తంగా మార్కెట్‌లో ఉల్లి ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధ‌ర‌ల‌తో కోయ‌కుండానే సామాన్యుల‌కంట క‌న్నీళ్ల‌ను తెప్పిస్తోంది ఉల్లి. హైద‌రాబాద్‌లో కిలో ఉల్లిధ‌ర సుమారు రూ.60లు ప‌లుకుతుండగా, రానున్న రోజుల్లో అది మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఏపీలో రూ.25ల‌కే కిలో ఉల్లిని అందిస్తున్నారు. మ‌హారాష్ట్ర నుంచి 300 ట‌న్నుల ఉల్లిని కిలో రూ.30లు చొప్పున కొనుగోలు చేశామ‌ని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రైతు బ‌జార్ల‌లో కిలో రూ.25ల‌కే అందిస్తున్నామ‌న్నారు.

మ‌హారాష్ట్ర‌తోపాటు ఉల్లిని ఎక్కువ‌గా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా పంట దెబ్బ‌తింది. దీంతో డిమాండ్‌కుత‌గ్గ స‌ప్లై లేకుండా పోయింది. దాంతో ఉల్లి ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. పెరిగిన ఉల్లిధ‌ర‌ల‌తో సామాన్యులు ప‌రేషాన్ అవుతున్నారు.

పెరిగిన ఉల్లిధ‌ర‌ల‌ప‌ట్ల తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త రెండేళ్లుగా నష్ట‌పోయామ‌ని, ఈ సారైనా త‌మ‌కు మ‌ద్ద‌తు ధ‌ర లభించ‌డం సంతోషంగా ఉంద‌ని వారు చెబుతున్నారు. ప్ర‌భుత్వాల‌నే కూల్చేసిన చ‌రిత్ర ఉల్లికి ఉంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి కోయ‌కుండానే క‌న్నీరు పెట్టిస్తోంది.

ఉల్లి ధ‌ర గ‌త నెల రోజుల్లో భారీగా పెరిగింది, ప్ర‌ధాన ఉల్లి ఉత్ప‌త్తి రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో క‌రువు కార‌ణంగా గ‌త ఏడాది పంట దెబ్బ‌తింటే ఇప్పుడు వ‌ర్షాల‌తో చేతికొచ్చే పంట అంద‌కుండా పోయింది. అందుకే ధ‌ర‌లు పెరిగాయ‌ని వ్యాపారులు చెబుతున్నారు. మ‌రోవైపు ఇందులో వాస్త‌వం లేద‌న్న వాద‌న‌లూ ఉన్నాయి. ద‌ళారులు కావాల‌నే కృత్రిమ కొర‌త‌ను సృష్టిస్తున్నార‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2018 - 19 సంవ‌త్స‌రానికిగాను వ్య‌వ‌సాయ మంత్రిత్వ‌శాఖ జారీ చేసిన హార్టిక‌ల్చ‌ర్ పంట‌వ మూడ‌వ ముంద‌స్తు అంచ‌నా ప్ర‌కారం 2019 జూన్‌తో ముగిసిన వ్య‌వ‌సాయ సంవ‌త్స‌రంలో ఉల్లి ఉత్ప‌త్తి 23.28 మిలియ‌న్ల ట‌న్నులు. ఇది దాదాపుగా గ‌తేడాది మాదిరిగానే ఉంది. అంటే ఉల్లిపంట ప‌డిపోయింద‌ని, డిమాండ్ కార‌ణంగానే అధిక ధ‌ర‌లు అన‌డంలో వాస్త‌వం లేదంటున్నారు. మ‌రోవైపు మార్కెట్‌కు ఉల్లి రావ‌డం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది.

ఉల్లి ధ‌ర కొండెక్క‌డంతో వినియోగ‌దారుడికి త‌డిచి మోపెడ‌వుతోంది. కానీ, మ‌ధ్య‌ల బాగుప‌డుతుంది మాత్రం ద‌ళారీలు మాత్ర‌మే. మార్కెట్ ఏదైనా జ‌రుగుతున్న‌ది మాత్రం ఇదే. దిగుబ‌డి త‌గ్గి మార్కెట్‌ల‌కు స‌రుకు పెద్దగారాని స‌మ‌యంలో ధ‌ర‌లు మ‌రింత మండుతున్నాయి. పండించే రైతుకు, మూట‌లుమోసే హ‌మాలీకి, విక్ర‌యించే చిరు వ్యాపారుల‌కు మిగిలేదానిలో మాత్రం పెద్ద మార్పు ఉండ‌దు. కానీ, ద‌ళారీల గ‌ల్లాపెట్టె మాత్రం నిండుతోంది. వినియోగ‌దారుడి చేబుల‌కు చిల్లుప‌డుతోంది. ఇప్పుడు ఉల్లి విష‌యంలో కూడా స‌రిగ్గా ఇదే జ‌రుగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే, జ‌గ‌న్ స‌ర్కార్ ఉల్లిధ‌ర‌ల నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం న‌లిగించేందుకు స‌బ్సిడీకి అందించేందుకు సిద్ధ‌మైంది. ఆ మేర‌కు రైతు బ‌జార్లలో ఉల్లిని పంపిణీ చేసేంద‌కు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను అవ‌లంభించింది. దీంతో ఉల్లి కోసం ప్ర‌జ‌లు బారులు తీరారు. స‌బ్సిడీ కోసం కిలో ఉల్లిని రూ.25ల‌కే ఇస్తుండ‌టంతో గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌ల‌లో వేచి చూడ‌టం ప్ర‌జ‌ల వంతైంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle