newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

రూల్‌ని ప‌క్క‌న పెట్టిన వైసీపీ.. ఇక చేరిక‌లే..

07-10-201907-10-2019 14:07:17 IST
Updated On 07-10-2019 16:06:32 ISTUpdated On 07-10-20192019-10-07T08:37:17.231Z07-10-2019 2019-10-07T08:37:10.645Z - 2019-10-07T10:36:32.572Z - 07-10-2019

రూల్‌ని ప‌క్క‌న పెట్టిన వైసీపీ.. ఇక చేరిక‌లే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఎవ‌రైనా చేరాల‌నుకుంటే ప్ర‌స్తుతం వారుంటున్న పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల్సిందేన‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇది వ‌ర‌కే స్ప‌ష్టం చేశారు. అయితే, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వైసీపీ రూటు మార్చిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ టీడీపీలో స‌రికొత్త‌ టెన్ష‌న్ మొద‌లైందంటూ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మ‌రోప‌క్క‌, ఇప్ప‌టికే కొంద‌రు టీడీపీ కీల‌క నేత‌లు వైసీపీతో ట‌చ్‌లో ఉన్నార‌న్న స‌మాచారంతో పార్టీ అధినేత చంద్ర‌బాబే స్వ‌యంగా రంగంలోకి దిగార‌ని, ఎవ‌రూ వైసీపీలోకి వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తుంది.

ఇన్నాళ్లూ బీజేపీ మాత్ర‌మే టీడీపీ నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ వ‌చ్చింది. ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీ నేత‌ల‌కు గాలం వేస్తుంద‌న్న వార్తలు విన‌వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కాస్త అటు ఇటుగా ఉన్న టీడీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ పార్టీ క‌న్నేసిన‌ట్టు తెలుస్తుంది.

వైసీపీ వైఖ‌రిని గమ‌నించిన కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు అవ‌స‌ర‌మైతే రాజీనామా చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని అధికార పార్టీ నేత‌ల‌తో రాయ‌బారాలు నడిపిన‌ట్టు స‌మాచారం. దీంతో అప్ర‌మ‌త్త‌మైన టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుమానం ఉన్న నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. అంతేగాక పార్టీని వీడ‌కుండా వారికి కౌన్సెలింగ్ ఇవ్వ‌డంతోపాటు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై భ‌రోసా ఇస్తున్నారు చంద్ర‌బాబు.

ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ క‌న్నేసిన అన్ని జిల్లాల్లోనూ స్వీప్ చేసింది. కానీ, వైజాగ్ సిటీలో మాత్రం ఆ టార్గెట్ రీచ్ కాలేక‌పోయింది. దీంతో విశాఖ టీడీపీ నేత‌ల‌పై వైసీపీ క‌న్నేసిందన్న వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

ఇందులో భాగంగా మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో వైసీపీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. అందుకు గంటా శ్రీ‌నివాస‌రావు కూడా ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మేన‌న్న సంకేతాలు వైసీపీకి పంపుతున్న‌ట్టు స‌మాచారం.

వైసీపీలోకి వ‌ల‌స‌ల్లో భాగంగా విశాఖ జిల్లాకు చెందిన ఆడారి కుటుంబం ఇప్ప‌టికే  చేరిపోయింది. మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు సోద‌రుడు కూడా త్వ‌ర‌లోనే వైసీపీలో చేర‌నున్న‌ట్టు ప‌లు క‌థనాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలోకి వ‌చ్చిన పరుచూరుకు చెందిన రామ‌నాథం కూడా తిరిగి జ‌గ‌న్ పార్టీకే జై కొట్టారు. తూర్పు గోదావ‌రి నుంచి కాపు సామాజిక‌వ‌ర్గంలో గ‌ట్టిప‌ట్టున్న తోట త్రిమూర్తులు కూడా అధికార‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఇన్నాళ్లూ బీజేపీలోకి వ‌స‌ల వెళుతున్న టీడీపీ నేత‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని ఆ పార్టీ అధిష్టానం వైసీపీలోకి వెళ్లే నాయ‌కుల‌ను మాత్రం క‌ట్ట‌డిచేసే ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేసింది.  ఈ క్ర‌మంలోనే ఒక‌రిద్ద‌రు నాయ‌కులు పార్టీని వీడినంత మాత్రాన న‌ష్ట‌మేమీలేదంటూ టీడీపీ నేత‌లు చెప్పుకొస్తున్నారు.

ఇలా ఒక్కొక్క నేత వైసీపీలో చేరుతుండ‌టంతో వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు స్వయంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగారు. పార్టీ మారుతార‌న్న అనుమానం ఉన్న నేత‌ల‌ను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వ‌డంతోపాటు ఎవ‌రూ పార్టీ ఫిరాయించ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు చంద్ర‌బాబు.

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   6 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   11 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   14 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   15 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle