newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

రూల్స్ బ్రేక్ చేయడం ఇక కుదరదు

29-08-201929-08-2019 08:38:15 IST
Updated On 29-08-2019 08:33:04 ISTUpdated On 29-08-20192019-08-29T03:08:15.711Z29-08-2019 2019-08-29T03:02:27.261Z - 2019-08-29T03:03:04.351Z - 29-08-2019

రూల్స్ బ్రేక్ చేయడం ఇక కుదరదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘనలకు చెక్ పెట్టేపనిలో ఉంది రవాణా, పోలీసు శాఖ. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసేవారి ఆటలు ఇక సాగవు. రాంగ్‌ రూట్‌లో వస్తున్నా, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నా, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ఇక కుదరదు.

Image result for traffic violations in ap whatsapp

మీ చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తో ఒక్క ఫొటో క్లిక్‌ మనిపించి.. దాన్ని రవాణా శాఖకు అందుబాటులోకి తీసుకురానున్న ఫోన్‌ నంబర్‌కు వాట్సప్‌ చేస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగి వారి భరతం పడతారు.

ఏపీలో లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పౌర భాగస్వామ్యంతో ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా 95428 00800 వాట్సప్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది.  రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారి ఫొటోల్ని ప్రజలు ఈ వాట్సాప్‌ నంబర్‌కు పంపవచ్చని మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు. 

పౌరులు తమ ప్రాంతాల్లో జరిగే ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఓవర్ లోడింగ్, రాంగ్ డ్రైవింగ్ వంటి వాటిని తమ ఫోన్లో బంధించి వాట్సప్ నెంబర్ కు పంపవచ్చు. ఇలా పంపే ఫొటోలో ఆయా వాహనాల నంబర్‌ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త వహించాలి.  ఇలా తమకు అందిన ఫొటోలను రవాణా శాఖ ఎన్‌ఫోర్సుమెంట్‌ బృందాలు పరిశీలిస్తుంది. ఆయా వాహనాల నెంబర్‌ ఆధారంగా వాహనదారుడి అడ్రస్‌కు చలానాలు పంపుతారు. 

తరచుగా ఇలాంటి  ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి లైసెన్సు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో కూడిన చలానాలు నేరుగా ఇంటికే రానున్నాయి. ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేయడం సులభతరమవుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది. పౌరుల భాగస్వామ్యం వల్ల మరింతగా వారి బాధ్యత పెరుగుతుందని, ప్రమాదాల తీవ్రత కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle