newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

రూట్ మార్చిన చంద్ర‌బాబు నాయుడు

18-06-201918-06-2019 08:44:21 IST
Updated On 21-06-2019 15:27:57 ISTUpdated On 21-06-20192019-06-18T03:14:21.530Z18-06-2019 2019-06-18T03:02:01.985Z - 2019-06-21T09:57:57.397Z - 21-06-2019

రూట్ మార్చిన చంద్ర‌బాబు నాయుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జాతీయ రాజ‌కీయాల్లో చేసిన హ‌డావుడి అంతాఇంతా కాదు. జాతీయ రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న భావించారు. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రినే చంద్ర‌బాబు ఎంపిక చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

యూపీఏలో ఉన్న పార్టీలు, బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. క‌చ్చితంగా ఈసారి న‌రేంద్ర మోడీని గ‌ద్దె దించుతామని బాబు ధీమాగా ఉండేవారు. అయితే, ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయ్యింది. చంద్ర‌బాబు అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి.

న‌రేంద్ర మోడీ మ‌రోసారి బంప‌ర్ మెజారిటీతో అధికారం చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ చ‌తికిల‌ప‌డింది. కేవ‌లం 3 పార్ల‌మెంటు సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. పైగా ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపిన కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మ్యాయి. దీంతో జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం అవ్వాల‌ని భావించిన చంద్రబాబుకు ఆ అవ‌కాశం ఏ మాత్రం లేకుండా పోయింది.

రాష్ట్రంలో అధికారం కోల్పోవ‌డం, కేంద్రంలో తాను తీవ్రంగా వ్య‌తిరేకించిన న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టంతో ఇప్పుడు చంద్ర‌బాబు త‌న వైఖ‌రి మార్చుకున్నారు.

జాతీయ రాజ‌కీయాల విష‌యంలో త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంభించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు స‌మాన దూరం పాటించాల‌ని భావిస్తున్నారు. ఎన్డీఏకు దూర‌మై త‌ప్పు చేశామ‌ని, త‌మ ఓట‌మికి అది కూడా ఓ కార‌ణ‌మ‌ని సుజ‌నా చౌద‌రి వంటి నేత‌లు గ‌ట్టిగా చెబుతున్నారు.

ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక చంద్ర‌బాబు న‌రేంద్ర మోడీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న‌తో విభేదాల‌ను వ్య‌క్తిగ‌త వైరంలా భావించి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు సైతం దిగారు.

ఇప్పుడు న‌రేంద్ర మోడీ మ‌రింత బ‌లోపేతం కావ‌డంతో ఈ స‌మ‌యంలో కూడా బీజేపీని, న‌రేంద్ర మోడీని వ్య‌తిరేకించ‌డం మ‌రింత త‌ప్పు చేయ‌డ‌మే అవ‌తుంద‌ని చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ మేర‌కు అంద‌రితో చ‌ర్చించిన చంద్ర‌బాబు కేంద్రంలో త‌మ‌ది త‌ట‌స్థ వైఖ‌రే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే, కాంగ్రెస్‌తో ఆయ‌న కొన్నిరోజుల‌కే త‌త‌మ బంధాన్ని తెంచుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. సుదీర్ఘ రాజ‌కీయ వైరాన్ని ప‌క్క‌న‌పెట్టి మ‌రీ తెలంగాణ ఎన్నిక‌ల ముందు స్వ‌యంగా రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు పార్ల‌మెంటు ఎన్నిక‌ల వ‌ర‌కు కాంగ్రెస్‌తో క‌లిసి ప‌నిచేశారు. ఓ ద‌శ‌లో యూపీఏలో చేర‌క‌ముందే అందులో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

అయితే, కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవ‌డం, రాహుల్ గాంధీ సైతం అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో చంద్ర‌బాబు కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యారు. మొత్తంగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు చంద్ర‌బాబు విధానాల్లోనూ మార్పు తీసుకువ‌చ్చాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle