newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

రుణ మాఫీకి పోస్ట్ డేటెడ్ చెక్కులా?

11-02-201911-02-2019 16:23:15 IST
Updated On 11-02-2019 17:32:10 ISTUpdated On 11-02-20192019-02-11T10:53:15.251Z11-02-2019 2019-02-11T10:52:15.124Z - 2019-02-11T12:02:10.311Z - 11-02-2019

రుణ మాఫీకి పోస్ట్ డేటెడ్ చెక్కులా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైతులకు రుణాల్ని మాఫీ చేసే ఒకానొక భారీ కార్యక్రమానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో కూడా సరిగ్గా ఇదే హామీనిచ్చిన బాబు తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటికి మూడు విడతలు మాత్రమే చెల్లించి నాలుగో విడత మొత్తాన్ని నిలిపివేశారు. ఇక ఇప్పుడు తాము చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చెక్కులన్నీ తిరిగి ఎన్నికల్లో గెలిపిస్తేనే చెల్లుబాటవుతాయన్న మాటను రైతు ఓటర్లకు చెప్పాలని అనుకుంటున్నారు. 

నిజానికి ఇది సాధ్యమయ్యే అంశమేనా? నిబంధనలు ఒప్పుకుంటాయా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఆర్థికభారం ఎక్కువగా ఉన్నందున చెల్లించలేక పోతున్నామని చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా ఓట్ల మెలిక పెట్టి పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని ఇవ్వడం ఏంటన్నది దేశం తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల్ని మాఫీ జాబితాల్ని సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని అవి రాగానే చెక్కుల్ని పట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు రైతుల ఇళ్లకు వెళ్లి ఓటు హామీని తీసుకుని చెక్కులు అందచేస్తారన్నది వార్త. 

పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడమనే విషయంలో నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కావాలంటే బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాలి. ప్రభుత్వం ఆ మొత్తాల్ని జమచేసినపుడే ఆ చెక్కులు చెల్లుబాటవుతాయన్నది నిజం. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్రమైన ఆర్ధిక పరిస్థితి నెలకొని ఉన్నది. జనవరి నెల జీతాలు కూడా అప్పు చేసి తెచ్చిన సొమ్ముతో చెల్లించవలసి వచ్చింది.

జనవరి నెలలో రూ.2500 కోట్లు ప్రభుత్వం సేకరించింది. ఇదిలాఉంటే ఇప్పటికే అన్ని రకాల చెల్లింపుల్నీ ప్రభుత్వం ఆపేసింది. చివరకు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల  నుంచి కూడా సొమ్మును తీసుకునే పరిస్థితి లేదు. ఇక గతంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన చెక్కులు నగదు కింద మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లిన చాలా మంది మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పావలా వడ్డీ వంటి పథకాల ద్వారా లబ్ది పొందిన వారు డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ డబ్బును ఆ ఖాతాలకు సర్దేస్తున్నారు. ఏపీలో కేవలం ఓట్ల పథకాలకు మాత్రమే నిధులు విడుదల అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే... ప్రభుత్వం తీరుపై విపక్షం మండిపడుతోంది. ‘‘దేశమంతా డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటే.. హైటెక్ చంద్రబాబు ఇలా రైతులకు రుణమాఫీ బకాయిల్ని పోస్ట్ డేటెడ్ చెక్కుల రూపంలో ఇవ్వాలని భావించడం రైతుల్ని నిలువునా మోసం చేయడమే’’ అంటున్నారు వైసీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి. ‘‘అసలు రుణమాఫీ హామీ 2012 నుంచే చంద్రబాబు ఇచ్చారని, ఇప్పటివరకూ రుణమాఫీ పూర్తిచేయకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ఆయనకే చెల్లింది’’అని ‘న్యూస్ స్టింగ్’కి చెప్పారు.

‘‘2019లో టీడీపికి ఓటేస్తేనే చెక్కులు పాస్ అవుతాయని చెప్పడం, టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం అప్రజాస్వామికం. చంద్రబాబు హామీలన్నీ బూటకమే. బాబు పాలన 5కరువులు, 4 తుపాన్లుగా సాగింది, కరువు మండలాలు పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి జనం బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీతో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 15వేల కోట్లు కావాలి. రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపునకు చంద్రబాబే బాటలు వేస్తున్నారు’’ అన్నారు నాగిరెడ్డి.

రుణమాఫీకి రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారనేది ఒట్టి పుకారు మాత్రమేనని, ఎన్నికలు వచ్చేలోపు పూర్తిరుణమాఫీ కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తు్న్నారని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ‘న్యూస్ స్టింగ్’ తో చెప్పారు. ‘‘ఎన్నికల ముందు టీడీపీని ఇబ్బందుల పాలు చేసేందుకే జగన్ పార్టీ ఈప్రచారం మొదలుపెట్టిందని, అదంతా అబద్ధమని, రైతులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దు’ అన్నారు అంగర. ‘‘రైతులకోసం అన్నదాత సుఖీభవ రాబోతోందని, ఎకరానికి ఐదువేల రూపాయలు చొప్పున ఏడాదికి రెండుదఫాలుగా పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తు్న్నామని, చంద్రబాబు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేస్తోంది’’ అని అంగర పేర్కొన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle