newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

రీ పోలింగ్ రచ్చ: ఈసీకి చంద్రబాబు లేఖ

17-05-201917-05-2019 09:05:33 IST
Updated On 27-06-2019 16:50:39 ISTUpdated On 27-06-20192019-05-17T03:35:33.526Z17-05-2019 2019-05-17T03:34:29.951Z - 2019-06-27T11:20:39.859Z - 27-06-2019

రీ పోలింగ్ రచ్చ: ఈసీకి చంద్రబాబు లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో చంద్రగిరి నియోజకవర్గంలో 19న జరగబోయే రీపోలింగ్ అంశం రాజకీయ దుమారానికి తెరలేపుతోంది. ఎన్నికల నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘమే ఉల్లంఘిస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియో జకవర్గంలో ఈనెల 19న రీపోలింగ్‌ జరపాలన్న ఎన్ని కల కమిషన్‌ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈసీకి ఘాటైన లేఖ రాశారు.

చంద్రగిరి నియోజకవర్గంలో కుట్రపూరితంగా వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగించిన అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. ఫలితంగా అనేకమంది తమ ఓటుహక్కును కోల్పోయారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో చోటుచేసుకుందని చెప్పారు.

ఓట్ల తొలగింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఐపీ అడ్రస్‌ లతో సహా అందజేసిందని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం స్పందించకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. అన్ని రాజకీయ పక్షాలను సరిసమానంగా చూడాల్సిన ఎన్నికల సంఘం ఒక్కరివైపు కొమ్ముకాయడం తమనెంతో బాధిస్తోం దని తెలిపారు. ఈసీ పక్షపాత వైఖరిపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని, ఇది మంచి పద్థతి కాదన్నారు. 

వైసీపీ చేసిన ఫిర్యాదులపై స్పందించి రీపోలింగ్‌ జరపడం ఎంతవరకూ సమంజసమని ఆయన నిలదీశారు. ఇదే సమయంలో ఈసీఐ టీడీపీ చేసిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 166,172,173, 192,193,194, 310,311,323 పోలింగ్‌ స్టేషన్లలో అక్రమాలు జరిగాయని, అక్కడ రీపోలింగ్‌ జరపించాలని కోరుతూ ఏప్రిల్‌ 12వ తేదీన లేఖ రాయడం జరిగిందని గుర్తు చేశారు. ఎక్కడైతే అవకతవకలు జరిగాయో ఆయా ప్రాంతాలను గుర్తించి అక్కడ రీపోలింగ్‌ జరపడం ఎన్నికల సంఘం బాధ్యతని ఆయన గుర్తుచేశారు. కానీ, తమ ఫిర్యాదును పక్కనబెట్టి వైసీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని 5 చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.

ఇప్పటికే ఈనెల 6వ తేదీన కొన్నిచోట్ల రీపోలింగ్‌ జరిగిందని చెప్పారు. అయితే, ఎప్పుడైనా, ఎక్కడైనా రీపోలింగ్‌ ఒకేసారి జరుగుతుందని చెప్పారు. కానీ, ఇక్కడ మాత్రం విచిత్రంగా దశల వారీగా రీపోలింగ్‌ జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పారు. ఇలానే ఫిర్యాదులుచేస్తే ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కూడా రీపోలింగ్‌ నిర్వహి స్తారా అంటూ ఎన్నికల సంఘాన్ని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపైనే స్పందిస్తూ తేదేపా ఇచ్చిన ఫిర్యాదులను పట్టించు కోకపోవడం ఏ ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతోందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో మునుపెన్నడూ చోటుచేసుకోలేదని తెలిపారు. 

 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324ను అడ్డుపెట్టుకుని పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పార్టీలపై ఈసీ అప్రకటిత నిషేధం విధిస్తోందని ధ్వజమెత్తారు. కనీసం ఈ అల్లర్లకు సంబంధించిన ప్రాథమిక నివేదికను కూడా పరిశీలించలేదని చెప్పారు. దీనినిబట్టిచూస్తే ఈసీఐ కేవలం బీజేపీ ఇచ్చే ఫిర్యాదులపైనే స్పందింస్తుందని అర్థమౌతోందన్నారు. సాధారణంగా ప్రతిచోట ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం నిలిపేయాల్సి ఉంటుందని, కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఈ నిబంధనను తుంగలోతొక్కారని మండిపడ్డారు.

ఈసీఐ ఏక పక్ష నిర్ణయాలతో 1951, పీపుల్స్‌ యాక్ట్‌లోని 126వ సెక్షన్‌ను అతిక్రమించి ప్రవర్తించిందన్నారు. ఏపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీడీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలపట్ల అధికారుల బదిలీలు, ఫిర్యాదులపై స్పందన, ఏకపక్ష నిర్ణయాలతో ఈసీఐ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాల వేళ బాబు లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఈసీ ఎం జవాబు ఇస్తుందో చూడాలి. 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle