newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

రివ‌ర్స్‌ టెండ‌రింగ్ రివ‌ర్స్ కొడుతోందా..?

14-08-201914-08-2019 12:54:14 IST
Updated On 14-08-2019 15:23:38 ISTUpdated On 14-08-20192019-08-14T07:24:14.360Z14-08-2019 2019-08-14T07:24:11.597Z - 2019-08-14T09:53:38.011Z - 14-08-2019

రివ‌ర్స్‌ టెండ‌రింగ్ రివ‌ర్స్ కొడుతోందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి బాధ్యత‌లు చేప‌ట్టిన త‌ర్వాత సంక్షేమ కార్యక్రమాల అమ‌లుతో పాటు గ‌త తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను త‌వ్వితీయాల‌ని కంక‌ణం క‌ట్టుకొని ప‌నిచేస్తున్నారు. ఈ మేర‌కు కీల‌క నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా ఈ విష‌యంలో మాత్రం జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గడం లేదు.

ముఖ్యంగా పోల‌వ‌రం స‌హా వివిధ ప్రాజెక్టు, పీపీఏల ఒప్పందాల్లో భారీగా అవినీతి జ‌రిగిందని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో పోల‌వ‌రం ప్రాజెక్టుపై జ‌గ‌న్ ఓ నిపుణుల క‌మిటీని వేసిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు నిజ‌మేన‌ని నిపుణుల క‌మిటీ తేల్చింది. దీంతో రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్లి డ‌బ్బులు మిగల్చాల‌ని జ‌గ‌న్ నిర్ణయించారు.

ఈ విష‌యంపై ఇప్పటికే కేంద్రం అభ్యంత‌రం తెలిపిన సంగతి తెలిసిందే. స్వయంగా కేంద్రమంత్రి పోల‌వ‌రంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు త‌మ దృష్టికి రాలేద‌ని పార్లమెంటులో ప్రక‌టించారు. అయినా, జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గకుండా న‌వ‌యుగ సంస్థను పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి త‌ప్పించారు. త్వ‌ర‌లో రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇంత‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ జ‌గ‌న్‌కు భారీ షాక్ ఇచ్చింది.

కేవ‌లం సూచ‌న‌లు మాత్ర‌మే చేయ‌గ‌లిగే అధికారం ఉన్న ఈ క‌మిటీ నిన్న ప్రాజెక్టుపై హైద‌రాబాద్‌లో స‌మీక్ష జ‌రిపింది. జ‌గ‌న్ త‌ప్పించిన‌ న‌వ‌యుగ సంస్థ ప‌నితీరు బాగానే ఉంద‌ని అథారిటీ చెప్పింది.

అంతే కాదు రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా పోల‌వ‌రం వ్య‌యం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అథారిటీ తేల్చింది. నిర్మాణం ఆల‌స్యం కావొచ్చ‌ని తేల్చింది. అథారిటీ ఇలా ప్రభుత్వ నిర్ణ‌యానికి వ్యతిరేకంగా చెప్పడం జ‌గ‌న్‌కు గట్టి షాక్ అని చెప్పవ‌చ్చు.

ఇక‌, పీపీఏల పున‌స‌మీక్ష చేయాల‌ని జ‌గన్ తీసుకున్న నిర్ణ‌యాల‌పైనా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇప్పటికే ఈ మేర‌కు జ‌గ‌న్ నిర్ణ‌యంపై కేంద్రం ప‌లుమార్లు అభ్యంత‌రం తెలిపాయి. అయినా జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గడం లేదు. తాజాగా, జపాన్ ప్రభుత్వం సైతం జ‌పాన్ రాయ‌బారి చేత జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ ఓ లేఖ రాసిన‌ట్లు ఓ ఆంగ్ల ప‌త్రిక వార్త రాసింది. ఇదే నిజ‌మైతే జ‌గ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ లాంటిదే.

కాగా, పోల‌వ‌రం, పీపీఏల పున‌స‌మీక్షనే ఇంత‌లా విమ‌ర్శలు వ‌స్తున్నా జ‌గ‌న్ మాత్రం త‌న నిర్ణయాన్ని మార్చుకోవ‌డం లేదు. ఈ రెండింటా అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌ని బ‌లంగా న‌మ్ముతున్న ఆయ‌న ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా వెన‌క‌డుగు వేయ‌వ‌ద్దని నిర్ణ‌యించుకున్నారు. వీటితో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా 25 శాతం కంటే త‌క్కువ జ‌రిగిన అభివృద్ధి, నిర్మాణ ప‌నుల‌ను కూడా స‌ర్కార్ నిలిపివేసింది. వీటిపై కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్లాల‌ని భావిస్తోంది. 

మొండిగా ముందుకు వెళుతున్న జ‌గ‌న్‌.. రివ‌ర్స్ టెండ‌రింగ్‌, పున‌స‌మీక్ష‌ల ద్వారా డ‌బ్బు మిగిల్చి, వేగంగా ప‌నులు జ‌రిగేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే మ‌రిన్ని విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. మ‌రి, ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డి దాకా వెళుతుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle