newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

‘రివర్స్’ రూట్ లో ఆంధ్రప్రదేశ్

20-09-201920-09-2019 13:40:15 IST
Updated On 20-09-2019 15:23:58 ISTUpdated On 20-09-20192019-09-20T08:10:15.384Z20-09-2019 2019-09-20T06:51:58.517Z - 2019-09-20T09:53:58.580Z - 20-09-2019

‘రివర్స్’ రూట్ లో ఆంధ్రప్రదేశ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ‘రివర్స్’ రూట్లో వేగంగా అడుగులు వేస్తున్నది. గత ప్రభుత్వ పాలన అంతా తప్పుల తడక, అవకతవకలు, అవినీతి మయం అని నమ్ముతున్న వైకాపా సర్కార్...ఆ ప్రభుత్వ విధానాలన్నీ తిరగదోడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. కోర్టుల నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వచ్చినా..సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా రూటు మార్చడానికి మాత్రం సిద్ధ పడటం లేదు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ అంటూ వైకాపా కొనసాగిస్తున్న దూకుడు రాష్ట్ర ప్రగతికి అవరోధంగా మారిందన్న ఆందోళన వ్యక్తమౌతున్నది.

ఎన్నికల ప్రచారంలో తెలుగు దేశం హయాంలో టెండర్ల ప్రక్రియ అవినీతి మయంగా జరిగిందని, కాంట్రాక్టులన్నీ అవకతవకల పుట్ట అనీ విమర్శించిన జగన్.. అధికారంలోనికి వచ్చిన తరువాత వాటి నిగ్గు తేల్చి తరువాత రద్దు పర్వానికి తెరతీసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా తన ఆరోపణలే వాస్తవాలు అన్న వైఖరితో సర్కార్ నిర్ణయాలు ఉంటున్నాయి. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ఏ ఒక్క టెండర్ విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు రుజువు చేయని సర్కార్ రద్దుల జోరు కొనసాగించడం కేవలం కక్షసాధింపుతోనే అన్న భావన జనంలో కలగడానికే ఉపయోగపడుతుంది. పోలవరం పనుల రద్దుపై ఇప్పటికే ఏపీలో రైతులలో ఆందోళన వ్యక్తమౌతున్నది.

ఆంధ్రప్రదేశ్ కు జీవధార వంటి ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యం జరిగితే తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందన్న భావమే ఆ ఆందోళనకు కారణం. ఇక పీపీఏల రద్దు విషయంలో కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని కోర్టులు తప్పుపట్టాయి. కేంద్రం అది సరికాదని హెచ్చరికలాంటి సూచన చేసింది. అన్ని వైపుల నుంచీ కమ్ముకొచ్చిన వ్యతిరేకత కారణంగా పీపీఏల విషయంలో సర్కార్ అనివార్యంగా ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. తాజాగా పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని రోడ్డు పనుల టెండర్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించడమే కాదు, విమర్శలకు తావిస్తున్నది. అమరావతి పనులు నిలిచిపోవడం, ఇసుక పాలసీ నిర్ణయంలో జరిగిన తీవ్ర జాప్యం, ఇలా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం బడుగుల ఉపాధిపై గొడ్డలి వేటులాగే పరిణమించింది.

ఉపాధి లేక...బడుగులు పస్తులండే పరిస్థితి వచ్చింది. పనులు నిలిచిపోవడం వల్ల పురోగతిపై కూడా తీవ్ర ప్రభావం పడుతున్నది. ‘నవరత్నాలు’ అమలుకు తేదీల ప్రకటన ఉన్న రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలూ ముందుకు సాగని విచిత్ర పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. ఇప్పుడిక తాజాగా పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని రోడ్డు పనుల రద్దుకు ప్రభుత్వం చెబుతున్న కారణం..ఈ పనులన్నీ ఎన్నికల ముందు హడావుడిగా అనుమతులు పొందినవేనన్నది. అయితే ఈ దూకుడు ఇక్కడితో ఆగేదిగా కనిపించడం లేదు. ముందు ముందు మరిన్ని పనులకు కూడా రద్దు వేటు పడుతుందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.

అలా రద్దు వేటు పడే టెండర్లలో ఇరిగేషన్ కు సంబంధించినవి కూడా ఉన్నాయని తెలుస్తున్నది. అన్ని రద్దులకూ ప్రభుత్వం చెబుతున్న కారణం ఒక్కటే అది అవకతవకలు, అవినీతి. రుజువు కాకుండా దేనినీ నిర్ధారించడం సాధ్యం కాదు. మూడు నెలలకు పైగా అధికారంలో ఉండి ఇప్పటి వరకూ అవకతవకల నిగ్గు తేల్చడం పై దృష్టి పెట్టని ఏపీ ‘రివర్స్’ గేర్ లో స్పీడ్ గా సాగడాన్ని చూస్తుంటే కక్ష సాధింపు చర్యలంటూ విపక్షం చేస్తున్న వాదనలో పస ఉందా అన్న అనుమానం ఎవరిలోనైనా కలుగక మానదు.

గత ప్రభుత్వ హయాంలో మంజూరు లభించి ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోతే గుత్తేదారుకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలి. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా నచ్చని ప్రతిదానిని రద్దు చేసుకుంటూ ముందుకు సాగడం వల్లన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. పరిశీలకులు చెబుతున్నదీ ఇదే. అటు కేంద్రం కూడా పీపీఏల రద్దు, పోలవరం టెండర్ల రద్దు విషయంలో ఇదే చెప్పింది. తమ పర్యవేక్షణలో సాగుతున్న పోలవరంలో ఎటువంటి అవకతవకలూ జరగలేదని కేంద్ర మంత్రి స్వయంగా స్పష్టం చేసినా జగన్ సర్కార్ కు తాను పట్టిన కుందేటిలో నాలుగో కాలు కనిపించలేదు. జగన్ సర్కార్ ‘రివర్స్‘ రూట్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి స్పీడ్ బ్రేకర్ గా మారుతున్నదనడంలో సందేహం లేదు.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   26 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   3 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle