newssting
BITING NEWS :
*ఏపీ కేబినెట్ భేటీ. శాసనమండలి రద్దుకి ఆమోదం*భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

'రివర్స్' దిశగా సీఎం జగన్ అక్రమాస్తుల కేసులు?

02-11-201902-11-2019 11:56:18 IST
Updated On 02-11-2019 17:06:05 ISTUpdated On 02-11-20192019-11-02T06:26:18.914Z02-11-2019 2019-11-02T06:11:15.677Z - 2019-11-02T11:36:05.939Z - 02-11-2019

'రివర్స్' దిశగా సీఎం జగన్ అక్రమాస్తుల కేసులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇప్పుడు రివర్స్ దిశగా పయనిస్తున్నాయా? అంటే ఔనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడం, సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో ఆయనపై కేసులు ఇంక నీరుగారాడం ఖాయమనుకున్నారు. వైసీపీ నేతల దగ్గర నుండి సగటు కార్యకర్త సైతం తమ అధినేతను కేసులు ఏమీ చేయలేవని, అధికారంలోకి వచ్చాం కనుక ఇక అన్నీ మంచిరోజులే అనుకున్నారు.

రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలో కూడా తమకు అనుకూల ప్రభుత్వమే వచ్చిందని సంబరపడ్డారు. నిజానికి ఆ ఎన్నికలకు ముందే కేంద్రంలో బీజేపీతో వైసీపీ మంచి సంబంధాలను కొనసాగించింది. బహిరంగంగా ఆ స్నేహం బయటకి కనిపించకపోయినా సాక్షాతూ వైసీపీ సీనియర్ నేతలే బీజేపీతో స్నేహాన్ని చెప్పకనే చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చాక విజయసాయి రెడ్డి లాంటి నేతలు కూడా ఢిల్లీలో ఆదేశాలు, అనుమతులతో రాష్ట్రంలో తమ నిర్ణయాలు అంటూ గట్టిగానే చెప్పుకున్నారు.

మొత్తంగా పరిస్థితులను చూసిన వైసీపీ క్యాడర్ జగన్ కేసుల నుండి రిలీఫ్ దొరకడం ఖాయం అనుకున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. రాజకీయ మేధావులు చెప్తున్న విశ్లేషణలు చూస్తే మాత్రం జగ్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు రివర్స్ దిశగా పయనమవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇందుకు ప్రస్తుత పరిస్థితితులే ఉదాహరణగా చెప్పుకోవాలి. గతంలో ఎన్నో కేసులలో.. ఎందరికో నేతలకు.. ఆయా సందర్భాలను బట్టి కోర్టుకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపులిచ్చారు.

కానీ ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉండడంతో ప్రజావసరాల దృష్ట్యా.. ప్రజల విలువైన సమయం, ప్రజాధనం వృధా అవుతుందని తనకు మినహాయింపు కావాలని సిబిఐ కోర్టును కోరినా కోర్టు ససేమీరా అంటూ పిటిషన్ కొట్టేసింది. అందుకు సిబిఐ.. కోర్టుకు భారీ ఉపోద్ఘాతం సమర్పించింది. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తే ఇప్పుడు ఆయనే అధికారంలో ఉండగా ఏమైనా చేయగలరు కనుకే మినహాయింపు కుదరనే కుదరదని ఘంటాపదంగా మొండిపట్టు పట్టింది.

సిబిఐ వాలకం చూస్తుంటే ముందుముందు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అవకాశమిచ్చిన బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేసి జైలుకి తరలించినా ఆశ్చర్యం లేదని ఇంతకు ముందే కొందరు మేధావులు చెప్పిన మాటలే నిజమవుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమకు అనుకూలమే అనుకున్న కేంద్రం కూడా సీఎం వైఖరికి రూటు మార్చిందనే ఊహాగానాలకు కొదువేలేదు. సాక్షాతూ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరినా రోజుల తరబడి నిరీక్షణే దానికి ఉదాహరణగా కనిపిస్తుంది.

చట్టానికి అందరూ సమానమే అంటూ రాష్ట్రంలో బీజేపీ ప్రకటనలు చేయడమే కాక వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ సీఎం మీద ఆరోపణలకు కూడా దిగుతున్నారు. రాష్ట్ర పరిపాలనలో కాకుండా వ్యక్తిగతంగా కూడా కేంద్రంలో బీజేపీ సహకరించడం లేదని స్పష్టంగా తెలుస్తున్నా అధికార వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేయకపోగా తామెప్పుడూ కేంద్రానికి సన్నిహితమే అనే సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే పరిస్థితులు మాత్రం సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రివర్స్ విధానాల మాదిరే తమ అధినేత విషయంలో కూడా జరుగుతుండడమే పార్టీ క్యాడరుకు కునుకులేకుండా చేస్తుంది. మరి ఈ రివర్స్ ట్రావెలింగ్ ఎంతవరకో చూడాల్సి ఉంది.

 

 

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   an hour ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   2 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   4 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   4 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   4 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   4 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   8 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   8 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   9 hours ago


టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేష‌న‌ల్ పార్టీల లోక‌ల్ కౌంట‌ర్‌..!

టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేష‌న‌ల్ పార్టీల లోక‌ల్ కౌంట‌ర్‌..!

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle