newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

రివర్స్ ట్రెండింగ్ మంచిదే కానీ.. ఉండవల్లిది హితవా లేక విమర్శా?

02-10-201902-10-2019 18:46:05 IST
2019-10-02T13:16:05.126Z02-10-2019 2019-10-02T13:16:03.153Z - - 15-10-2019

రివర్స్ ట్రెండింగ్ మంచిదే కానీ.. ఉండవల్లిది హితవా లేక విమర్శా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాజెక్టులలో అవినీతిని అరికట్టే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ ట్రెండింగ్ మంచిదే కానీ కింది స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు, తగ్గించేందుకు ప్రయత్నించకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం చేయదల్చుకున్న మంచి పాలన తగిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండరింగ్‌తో ఇంత భారీ తేడా వస్తుందని ఊహించలేదని అందుకే  మేఘా కృష్ణా రెడ్డి కంపెనీ రూ.700 కోట్లు తక్కువకు టెండర్‌ చేయడానికి ఎలా ముందుకు వచ్చారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజాయతీగా పని చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రశంసించారు. ఏ పని ఇచ్చినా జ్యూడిషియల్‌గా ఫాలో అప్‌ చేసి ఇస్తుండటం మంచి పరిణామం అన్నారు. కింది స్థాయిలో అవినీతి ఉంది.. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు. అందరు నిజాయతీగా పని చేయక తప్పదనే పరిస్థితి తీసుకురావలన్నారు ఉండవల్లి. పాలనలో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. 57 శాతం పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చారు.. అదే శాశ్వతం అనుకోవద్దని ఉండవల్లి హెచ్చరించారు. 

ప్రజల్లో మంచి పేరుతో పాటు.. తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం జగన్‌ విధి అన్నారు. ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచి జాగ్రత్తగా వ్యవహరించమని కోరారు. జగన్‌ ఒక్కడిగా వచ్చాడు.. ఒక్కడిగా నడిపించాడు.. ఇప్పుడు తేడా రానివ్వొద్దన్నారు. ప్రభుత్వంపై సీరియస్‌గా ఆరోపణలు చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. జగన్ ప్రభుత్వంపై జనంలో ఇంతవరకు అయితే  వ్యతిరేకత లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే అలా అని అంతా బాగుందని చెప్పడానికి లేదని అన్నారు. నవరత్నాల అమలులో చిన్న తేడా వచ్చినా తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆయన హెచ్చరించారు. 

పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు 50శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రులై కేవలం తొమ్మిది నెలల్లోనే దిగిపోయారన్న విషయం ఎవరూ మర్చిపోవద్దని ఉండవల్లి గుర్తు చేశారు. ప్రజా అశయాలను నెరవేర్చకపోతే జగన్‌నైనా దింపేస్తారని ఉండవల్లి హెచ్చరించారు. మీరు మంచిగా ఉన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారని ఎన్నడూ అనుకోవద్దు. అందరూ మంచిగా ఉండక తప్పని పరిస్థితులు తీసుకురావాలి. ఇప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవస్థలు సరిగా లేవని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 

ఇసుక, విద్యుత్ కోతలు వైఎస్ జగన్ పాలనలో మైనస్‌గా కనిపిస్తున్నాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇసుక విధానం, విద్యుత్ కోతల సమస్యలకు కారణాలేమైనప్పటికీ ప్రజలకు అవన్నీ అవసరం కావని, అంతిమంగా వారికి ఫలితమే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజల్లో మంచి పేరుతో పాటు ముఖ్యమంత్రికి తమపై మంచి విశ్వాసం ఉందని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి రావాలన్నారు. ముఖ్యంగా నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు జరగకపోయినా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని జగన్ ప్రభుత్వాన్ని ఉండవల్లి హెచ్చరించారు.

ఏదేమైనా.. ఉండవల్లి ఏపీ ప్రభుత్వం పాట్ల కాస్త సానుకూలత వ్యక్తం చేస్తూనే ప్రభుత్వ యంత్రాంగం గీతదాటితే, అలసత్వం ప్రదర్శిస్తే ప్రభుత్వానికి జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని విమర్శ కూడా చేశారు. వైఎస్ జగన్ పాలనపై ఇప్పటివరకు పొగిడేందుకు, తిట్టేందుకు ఏమీ లేదంటూనే ఇసుక విధానం, విద్యుత్ కోతలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చాయని చెప్పడంలో ఉండవల్లి వెనుకాడలేదు.

ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ చేస్తున్న విమర్శలు ఉబుసుపోక విమర్శలని, పసలేని విమర్శలని కొట్టివేయడంతో సరిపెట్టుకోకుండా తటస్థ వర్గాలనుంచి లేక సానుకూలత ప్రదర్సిస్తున్న వ్యక్తుల వద్దనుంచి వస్తున్న విమర్శలను, వ్యాఖ్యలను ప్రభుత్వం పట్టించుకోక తప్పదు. 

 

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   6 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   11 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   14 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   15 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   15 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle