newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

రివర్స్ టెండరింగ్‌లో తొలి బోణీ.. ఒక ప్యాకేజీలోనే రూ. 58 కోట్ల ఆదా

21-09-201921-09-2019 15:46:55 IST
Updated On 23-09-2019 14:56:44 ISTUpdated On 23-09-20192019-09-21T10:16:55.013Z21-09-2019 2019-09-21T10:16:45.563Z - 2019-09-23T09:26:44.325Z - 23-09-2019

రివర్స్ టెండరింగ్‌లో తొలి బోణీ.. ఒక ప్యాకేజీలోనే రూ. 58 కోట్ల ఆదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకవైపు పోలవరం ప్రాజెక్టుకై కేంద్ర ప్రాధికార సంస్థ, మరోవైపు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పదే పదే అభ్యంతరం చెబుతున్నప్పటికీ, తీవ్రంగా హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో అవినీతిని బయటపెట్టి తీరుతానంటూ పట్టుపట్టి రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ముందుకెళ్లిన ఆంద్రప్రదేశ్ ప్రబుత్వం తొలి బోణీ కొట్టింది. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ సొమ్మును ఆదా చేసి తీరుతామంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటన నిజమేననిపిస్తూ తొలి ఫలితం ఉనికిలోకి వచ్చింది. రివర్స్ పోలవరం ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజి టెండర్ తిరిగి ఖరారైన సందర్భంగా దిగ్భ్రాంతి కలిగే నిజాలు బయటపడ్డాయి.

టీడీపీ హయాంలో పోలవరం 65వ ప్యాకేజీ పనులను రూ. 292.09 కోట్లకు పనులు దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ తాజాగా రూ. 231.47 కోట్లకు టెండర్‌‌ని తిరిగి దక్కించుకుంది. బిడ్‌లో మొత్తం ఆరు కంపెనీలు పోటీపడగా.. 15.6 శాతం తక్కువకి మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ టెండర్‌ వేసింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే సంస్థ కేవలం 4.8 శాతం ఎక్కువకి టెండర్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ ఒక్క ప్యాకేజీలోనే రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో ప్రభుత్వానికి రూ. 58.53కోట్లు ఆదాకానుంది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు టెండరింగ్‌లో భారీగా అవినీతి జరిగిందని మరోసారి నిర్ధారణ అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింతలో అక్రమాలు చోటుచేసుకున్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో  జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

రివర్స్ టెండరింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఎంత విషప్రచారం చేసినా,  కేంద్రం నుంచి లోపాయికారీగా ఎంత ఒత్తిడి చేసినా చలించని సీఎం జగన్ టీడీపీ అవినీతిని బద్దలు గొట్టారనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో మొత్తం 3 వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని, నాటి అధికార పార్టీ అధికంగా కోట్ చేయించి భారీ ఎత్తున ముడుపులు లాగిందని వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలు నిజమయ్యేటట్టున్నాయి. 

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై టీడీపీ, వైసీపీల సిగపట్లను పక్కన బెట్టి, రివర్స్ టెండరింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి రెండేళ్లలో పూర్తి చేస్తే లక్షలాది ఎకరాల పంటపొలాలకు గోదావరి నీరు అంది రాష్ట్రం సస్యశ్యామలం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle