newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

‘‘రివర్స్‌లో నడుస్తున్న జగన్ పాలన’’

21-10-201921-10-2019 15:26:32 IST
Updated On 21-10-2019 16:13:37 ISTUpdated On 21-10-20192019-10-21T09:56:32.284Z21-10-2019 2019-10-21T09:56:13.860Z - 2019-10-21T10:43:37.301Z - 21-10-2019

‘‘రివర్స్‌లో నడుస్తున్న జగన్ పాలన’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వై.సుజనా చౌదరి. బిజెపి తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో పాల్గొన్న ఎంపి సుజనా చౌదరి పలు వ్యాఖ్యలు చేశారు.

Image may contain: 3 people, including Kesav Rao, people standing, sky, cloud and outdoor

జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతియుత మార్గంలో పాలన సాగిస్తున్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో  బిజెపి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగుతాయన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల కుటుంబ పాలన సాగుతోందని, అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. 

జమ్ము కాశ్మీర్ లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడానికి గత ప్రభుత్వాలు వెనుకాడాయని.. బీజేపీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన వెంటనే 72 రోజుల్లోనే ఆ పనిచేసిందన్నారు.

దేశచరిత్రలో కీలకమయినదన్నారు. ఆర్టికల్ 370 ఎప్పుడో రద్దుచేసి ఉంటే మన దేశం చాలా అభివృద్ది చెంది ఉండేదన్నారు సుజనా చౌదరి. వైసీపీ కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ గౌరవం కోసం పోరాడారన్నారు. 

తెలుగుదేశం, వైసీపీ పార్టీ ల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీ రాష్ట్రంలో అంతా రివర్స్ నడుస్తోందని, వైసీపీ నేతల వల్ల పరిశ్రమలు వచ్చే అవకాశమే లేదన్నారు. వైసీపీ నేతలు పిచ్చి వేషాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉరుకోదన్నారు.

ప్రజాస్వామ్య పద్దతిలో ఆంధ్రప్రదేశ్ లో పాలన జరగడం లేదని, పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం, వేల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. 

దేశంలో దమ్మున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు సుజనాచౌదరి. వైసీపీ నేతలు చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని వైస్ ఛాన్స్లర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని సుజనా చౌదరి ఆరోపించారు.

జాతీయవాదంతో బీజేపీ పార్టీని పటిష్టం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో గాంధీజీ సంకల్ప యాత్ర సందర్భంగా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి , ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle