newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

రిటర్న్ గిఫ్ట్ ఇదేనా..?

13-12-201813-12-2018 16:09:14 IST
Updated On 13-12-2018 16:08:04 ISTUpdated On 13-12-20182018-12-13T10:39:14.853Z13-12-2018 2018-12-13T10:38:04.648Z - 2018-12-13T10:38:04.651Z - 13-12-2018

రిటర్న్ గిఫ్ట్ ఇదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు కోసం కెసియార్ రిటర్న్ గిఫ్ట్ రెడీ! భోజనం తయార్... కెసియార్ టుడే స్పెషల్! ఇదీ ఇవాళ నడుస్తున్న కహానీ! తెలంగాణ ఎలక్షన్ స్పెషల్ వంటకాన్ని ఇప్పటికే రుచి చూసిన చంద్రబాబుకు కెసియార్ నిన్నటికినిన్న సాఫ్ట్‌గా చెప్పిన హాటెస్ట్ న్యూస్ ఇదే... రిటర్న్ గిఫ్ట్! ఏంటా రిటర్న్ గిఫ్ట్... మనింటికొచ్చిన అతిథులు తెచ్చే బహుమతులకు తిరిగి వెళ్ళేటపుడు మన తరఫున ఇచ్చే ‘తిరుగు బహుమతే’ Return Gift. ఈ మాటలన్న కెసియార్ మనసులో రిటర్న్ గిఫ్ట్‌కు వున్న అర్థాలేంటి? నిర్వచనమేంటి... తాత్పర్యాలు ఏంటన్న మాటలకు అక్షరాలు వెదుక్కుంటోంది సగటు తెలుగు ప్రజానీకం! తెలంగాణా ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకంపనాలు లక్ష... మిగిల్చినవి అక్షర లక్షల ప్రశ్నలు! ఒకపక్క మూడున్నర దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఒరిజినల్ తెలుగుదేశానిదైతే... మరోపక్క 23 సంవత్సరాల క్రితం వైస్రాయ్ ఉదంతంతో ఆ పార్టీనే సొంతం చేసుకున్న చరిత్ర చంద్రబాబుది! ఇవి ప్రశ్నలు... కొన్నింటికి జవాబులుంటే... మరికొన్నింటికి మాత్రం ప్రశ్నలే జవాబులు! ఇక విషయంలోకి వచ్చేద్దాం!

తెలంగాణా ఎన్నికల్లో బుల్డోజర్లతో అన్ని పార్టీలనూ నేలమట్టం చేసిన కెసియార్... తన మొదటి మీడియా మీట్‌లో నేరుగా ప్లస్ నర్మగర్భంగా చెప్పిన మాటలే ఇవి! మళ్ళీ వినండి... జాగ్రత్తగా! తానొవ్వక... నొప్పించక రీతిలో కెసియార్ తన విజయంలో చంద్రబాబు గురించి పరోక్షంగా... ప్రత్యక్షంగా దొర్లించిన మాటలకు అర్థాలేంటి? ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు తాత్పర్యాలు వెదుక్కుంటున్న వేళ ఒక చిన్న బ్యాక్‌డ్రాప్...! 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు (note for vote) వెలుగు చూసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ  అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడినట్లుగా ఏసీబీ అభియోగం మోపింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లు తొలి ముగ్గురు నిందితులు కాగా, మత్తయ్య నాలుగో నిందితుడు. అనుబంధ అభియోగపత్రంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఐదో నిందితుడిగా ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్య తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

విషయం అర్థమైపోయే వుంటుంది.  ఇక్కడ తెలుగు ప్రజానీకానికి అర్ధం కానంత అవివేకాలు లేవిక్కడ ! కెసియార్ ఆవేశాలూ... ఆక్రోశాలు... నోటి దురుసుతనాల గురించి విన్నా... తెలిసినా... వాటిని భరించిన ఇక్కడి 'ఆంధ్రా తెలుగోళ్ళు... ఎందుకాయన్నే సహించారు..? నాలుగున్నర సంవత్సరాల క్రితం ఈ హైదరాబాద్ భూభాగాన్ని వదిలి తన రాజకీయ జీవతాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన చంద్రబాబు.. ఆనాడు అర్థరాత్రి అకస్మాత్తుగా తీసుకున్న 'వలస' నిర్ణయానికి అసలు కారణాలేంటి? తాను తన బలగం... పదేళ్ళపాటు నిక్షేపంగా, దర్జాగా వుండాల్సిన హైదరాబాద్‌ను అర్థాంతరంగా విడిచి వెళ్ళాల్సిన అవసరాలేంటన్నవి దాదాపు జనాలందరికీ అర్థమై , అరదశాబ్దం కావస్తోంది. ‘ఓటుకు నోటు’... ఒక ఎమ్మెల్సీని కొనుక్కునే ప్రయత్నంలో అడ్డంగా బుక్కయిపోయిన కేసది..! నీ పుట్టలో నేను వేలుపెట్టను... నా పుట్ట నేనే చూసుకుంటానంటూ తట్టాబుట్టా సర్దేసుకున్న ఒప్పందపు గతమది! ఆనాడు చంద్రబాబు వెళ్ళిపోయారు. తన గతాన్నిక్కడే పూడ్చేసి... ఒడంబడికలు చేసుకుని లేని రాజధానివైపు ప్రజలవద్దకే పాలన అంటూ బెజవాడ బండెక్కారు. ఇదీ మనం మరచిపోదామన్నా... వద్దనుకున్నా గుర్తుకొచ్చే గతం! హైదరాబాద్ టు విజయవాడ!

ఇక ఈ హైదరాబాద్‌లో వేళ్ళూ-కాళ్ళూ ఏవీ పెట్టనంటూ వెళ్ళిపోయిన బాబు... ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినా ఈవైపుకే చూడలేదు. ఆ GHMC ఎన్నికల్లో తన పార్టీకి మద్దతుగా ఉన్న హైదరాబాదీయులు ఎందుకు ఓటెయ్యలేదు..? ఇక్కడి రాజకీయాలు వద్దని వెళ్లిపోయిన పెద్ద మనిషిని మర్చిపోయిన ‘సర్దుబాటు’ సహనమే ఇక్కడి ఆంధ్రా జనానిది! ఆనాటి ఆ సర్దు‘బాటే’ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాల్సి ఎగరేసింది. పోనీ... ఇక్కడి నుంచి వెళ్ళే ముందు తన పార్టీని నిలబెట్టిన వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేయలేని నిస్పహాయుడు బాబు! అటువంటి చంద్రబాబుకు ఇక్కడింకా ఫాలోయింగ్ వుందంటూ భ్రమలు కల్పించిందెవరు? తన చుట్టూ చేరిన భజనపరులు... వాళ్ళల్లో రాజకీయాల ముసుగులేసుకున్న వ్యాపారులు కొంతమందైతే... అదే రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని బాల్ గేమ్స్ ఆడుతున్న ఇంకొంతమంది బ్యూరోక్రాట్లు, ఖాకీలు ఇంకొంతమంది ! ఇక తెలంగాణలో తెరాస ఖతమైపోయిందంటూ బోగస్ నిఘాలు నిర్వహించిన ఇంకొకళ్ళిద్దరు ఇంటలిజెన్సోళ్లు మరికొంతమంది. . ! ఈ ఫేక్ నిఘా నివేదికలకు బాబు బుట్టలో పడిపోయిన దాఖలాలు అద్దం మీదే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ప్రలోభాలకు లొంగిపోయారు. ఇంకేముంది ‘వి మిస్ యు బాబు’ అంటూ ప్లకార్డులు రాయించుకున్నారు. దాంతో  ఈ 'అభినవ' హైదరాబాద్ సృష్టికర్త లొట్టలేసుకుంటూ జింబో నగర ప్రవేశం .

ముగింపు వాక్యాలు! భంగపడ్డ బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏంటి? బతికుంటే బలుసాకులు తిందామని వెళ్ళిపోయిన పెద్దాయనకు ఆయన పూర్వ-అ‘పూర్వ’ మిత్రుడు ఇచ్చే తిరుగు బహుమతి ఏమై వుంటుందన్నది ఊహించలేనిదేమీ కాదు... అదే ఓటుకు నోటు కేసు... ఒక్క నోటీసు చాలు... ఇప్పటివరకూ ఓటుకునోటు కేసులో కనీసం ఒక్క తాఖీదు కూడా అందుకోలేని బాబుకు అదే రిటర్న్ గిఫ్ట్... తిరుగు బహుమతి! తిరుగులేని బహుమతి.  కెసియార్ మనసులో రగిలిపోతున్న బహుమతి మంత్రాంగం ఇదే! టిట్ ఫర్ టాట్! నోటీస్!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle