newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

22-01-202022-01-2020 13:13:56 IST
Updated On 22-01-2020 13:30:05 ISTUpdated On 22-01-20202020-01-22T07:43:56.394Z22-01-2020 2020-01-22T07:43:46.176Z - 2020-01-22T08:00:05.426Z - 22-01-2020

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతూనే వుంది. బుధవారం మూడవరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రైతు భరోసా కేంద్రాలపై సభలో చర్చ కొనసాగుతుండగా, స్పీకర్‌ పోడియమ్‌ చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు . వారంతా తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని విపక్ష సభ్యులు.. ఒక దశలో ఆయనపైకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఈ దశలో జోక్యం చేసుకున్న సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తరహా చర్యలు సరి కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా స్పీకర్‌ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేయడంపై విమర్శించారు. చర్చల్లో పాల్గొనాలంటే సభకు రావాలని, సంస్కారం లేకుండా అధికార పార్టీపై దాడికి రావడం ఎందుకన్నారు. అసలు పోడియమ్‌ మెట్లు పైకెక్కి స్పీకర్‌ ఛైర్‌ పక్కనే కూర్చుని.. ఇంతటి దారుణంగా డెమోక్రసీని అపహాస్యం చేస్తున్న పరిస్థితి. మొత్తం కలిపి 10 మంది లేరు అక్కడ. ఇక్కడ 151 మంది ఉన్నారు. అయినా కూడా ఈ 151 మంది ఎంతో ఓపికగా ఇక్కడే కూర్చుని వింటున్నారు. 

కానీ అక్కడ వాళ్లు ఏ రకమైన కామెంట్స్‌ పాస్‌ చేస్తున్నారు. పూర్తిగా పోడియమ్‌ మీదకు వచ్చారు. స్పీకర్‌ ఛైర్‌ చుట్టూ గుమిగూడారు. స్పీకర్‌ను అగౌరవ పరుస్తున్నారు. అలా అగౌరవ పర్చడమే కాకుండా, అక్కడ నుంచి ఏ రకమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.. అంత దారుణంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే ఇటు వైపున కూర్చున్న సభ్యులందరికీ కూడా రెచ్చిపోయే పరిస్థితులు లేకుండా ఎలా ఉంటాయి? అని చెప్పి నేను అడుగుతా ఉన్నానన్నారు. 

‘అధ్యక్షా నేను ఇప్పటికైనా ఒకటే చెబుతున్నాను. ఆ మెట్ల దగ్గరే.. ఆ రింగ్‌ దాటి ఎవరైనా ఇక్కడికి లోపలికి వస్తే.. మార్షల్స్‌ను మొత్తం అక్కడే పెట్టండి. రింగ్‌ దాటి ఎవరైనా వస్తే,  మార్షల్స్‌ వాళ్లను అటు నుంచి అటే ఎత్తుకుని బయటకు తీసుకుని పోయే ఏర్పాటు చేయకపోతే, ఈ సభలో ప్రజా సమస్యలకు విలువనిచ్చే పరిస్థితి కూడా ఉండదు. వెంటనే మార్షల్స్‌ను పిలవండి. అక్కడ పూర్తిగా రింగ్‌ ఫామ్‌ చేయమని చెప్పండి. వాళ్లు ఎవరైనా వస్తే వాళ్లను అక్కడి నుంచి అటే ఎత్తుకుపొమ్మని చెప్పండి’’ అంటూ సీఎం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle