newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

22-01-202022-01-2020 16:24:45 IST
2020-01-22T10:54:45.865Z22-01-2020 2020-01-22T10:54:42.227Z - - 26-02-2020

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నేత, మాజీ ఎంసీ జేసీ దివాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఒక్క వైసీపీ తప్ప అన్నిపార్టీల వారు అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తన నివాసంలో మీడియాలో మాట్లాడిన జేసీ... జగన్ తీరుపై మండిపడ్డారు. మూడురాజధానుల బిల్లు అసెంబ్లీలో పాసయినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. దేశానికి ఒకటే రాజధాని ఉందన్నారు.

చంద్రబాబుపై కోపం, ఒక వర్గంపై ద్వేషం, వ్యతిరేకత వల్ల అమరావతిని దూరం చేయాలంటున్నారన్నారు. ఒకేమాట, ఒకేబాట అయితే చేయవచ్చన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి కావాలన్నారు.  టీడీపీ వారు తమ పాలనా కాలంలో రాజధాని ప్రాంతంలో ముందే భూములు కొన్నారని, ఇప్పుడు ఇదే పనిని వైసీపీ వారు చేస్తున్నారని విమర్శించారు.

బుధవారం జేసీ మాట్లాడుతూ.. టీడీపీ వారు ముందు చేశారు, ఇప్పుడు వైసీపీ వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో దొందూదొందేనని జేసీ అన్నారు. విశాఖలో రాజధానిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాయలసీమ నుంచి విశాఖపట్నంకు అసలు బస్సు సౌకర్యమే లేదని, దీని వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు.

ప్రాంతీయ పార్టీలు పోవాలని, జాతీయ పార్టీలే ఉండాలని జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక తిక్కమనిషని, పవన్ చెప్పేవరకూ ఏపీలో ఏం జరుగుతుందో ప్రధాని మోడీకి తెలియదా అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ఒకవేళ పట్టించుకోకపోతే కేంద్రం కూడా తప్పు చేసినట్లే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.పోలీసులను అడ్డం పెట్టుకుని ఆందోళనలను అణచివేస్తున్నారన్నారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మహాన్యూస్ యూట్యూబ్ ఛానెల్ని సబ్ స్కైబ్ చేసుకోండి. అందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.youtube.com/user/mahaanews/videos


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle