newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే..?

21-09-201921-09-2019 14:12:26 IST
Updated On 21-09-2019 14:43:37 ISTUpdated On 21-09-20192019-09-21T08:42:26.310Z21-09-2019 2019-09-21T08:42:20.216Z - 2019-09-21T09:13:37.916Z - 21-09-2019

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. పార్టీలోకి చేరికల స్పీడ్ చూసి వారి నిర్ణయానికి వచ్చారు. ఏపీలో ఇటు వైకాపా...అటు తెలుగు దేశం పార్టీలకు సమ దూరం పాటించాలన్న విధానాన్ని కమలం పార్టీ అవలంబిస్తున్నది. అందుకు అనుగుణంగా చేరికలకు తలుపులు బార్లా తెరిచింది. అందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నది. అయితే ఈ సంప్రదింపులకు సానుకూలంగా స్పందిస్తున్నది రాష్ట్రంలో విపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు మాత్రమే.

అధికార పార్టీ వైకాపాలోంచి ఇప్పటికిప్పుడు వలసలు వచ్చే అవకాశాలు లేశమాత్రంగానైనా కనిపించడం లేదు. తెలుగుదేశం నుంచి వలసలు భారీగానే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కమల దళం బలోపేతం కావడానికి ఈ వలసలు ఎంత వరకూ దోహదపడతాయన్నది అనుమానమే. రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ముందుగా ప్రజలలో ఆ పార్టీ పట్ల నమ్మకం, కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ఇసుమంతైనా సహకారం అందించలేదన్న ఆగ్రహం తొలగిపోవాలి.

రెండో సారి కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ ఏపీ అభివృద్ధికి ఇతోధికంగా సహకారం అందిస్తున్నారన్న విశ్వాసం కలగాలి. కేవలం పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వచ్చినంత మాత్రాన అది కలిగే అవకాశం లేదు. అందుకే వలసలు పార్టీ బరువు పెరగడానికి ఉపయోగపడతాయే తప్ప...ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి దోహదపడవు. అదీ కాక ఇప్పుడు బీజేపీ తీర్ధం పుచ్చుకోవడానికి క్యూ కడుతున్న నేతలంతా తమ పార్టీలో సరైన స్థానం లభించలేదన్న అసంతృప్తులూ, అధాకారానికి దూరంగా ఉండటం ఇష్టం లేక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా అని దగ్గరౌతున్న నేతలేనని చెప్పాలి.

ఐదేళ్ల పాటు అధికార పార్టీలో కీలక పదవులు అనుభవించి అధికారం దూరం కాగానే కమలం గూటికి చేరే నేతల వల్ల పార్టీ బలం, ప్రతిష్ట పెరుగుతాయని భావంచడం సరికాదు. ఏపీలో ముందుగా ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు బీజేపీ చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట పెరగాలంటే ఏపీ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అమరావతి, పోలవరం నిర్మాణాలను పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి వాటి పనులు జోరందుకునేందుకు చర్యలు చేపట్టాలి. అవసరమైతే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం తీసుకుని స్వయంగా పనులను పర్యవేక్షించాలి.

అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ, బందర్ పోర్టు, దుగ్గరాజ పట్నం పోర్టుల విషయంలో ప్రతిష్టంభనకు తెరదించి ఆమోదం తెలపాలి. ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు విషయంలో జాప్యాన్ని, అయోమయాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.  ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతల విషయంలో నేరుగా అధిష్టానమే వ్యవహారమంతా  చూస్తున్న నేపథ్యంలో వారి చేరికల వల్ల రాష్ట్రంలో రాజకీయాలు పెద్దగా ప్రభావితం అయ్యే అవకాశాలు లేవు. 

రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట ఇనుమడించాలంటే చేరికల కంటే కేంద్రం ఏపీ ప్రగతికి అన్ని విధాలుగా దోహదపడుతున్నదనీ, సహకారం అందిస్తున్నదన్న విశ్వాసం ప్రజలలో కలిగేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పీపీఏల రద్దు విషయంలో కేంద్ర మంత్రి నిర్ద్వంద్వంగా ప్రభుత్వ వైఖరిని ఖండించడం, పోలవరం పనులు జాప్యం అయ్యేలా రివర్స్ టెండర్లు సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం వంటి చర్యలు ప్రజలలో బీజేపీ పట్ల సానుకూలత వ్యక్తమయ్యేందుకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. అలాగే కేంద్రం నిధుల విడుదల విషయంలో, విభజన హామీలను నెరవేర్చే విషయంలో ఒకింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలను వేగవంతం చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి కారణంగా బీజేపీ వేగంగా ప్రజలలోకి చొచ్చుకుపోయే అవకాశాలు ఉంటాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle