newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రాష్ట్రంలో కొత్తగా మరో 38 కరోనా కేసులు

18-04-202018-04-2020 08:17:51 IST
Updated On 18-04-2020 09:15:03 ISTUpdated On 18-04-20202020-04-18T02:47:51.812Z18-04-2020 2020-04-18T02:47:49.923Z - 2020-04-18T03:45:03.035Z - 18-04-2020

రాష్ట్రంలో కొత్తగా మరో 38 కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో కొత్తగా 38 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదు కాగా.. నెల్లూరులో 6, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఐదేసి కేసులు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగేసి కేసులు చొప్పున, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి ఒక్కరోజే 13 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. అలాగే, అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. 

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 35కి చేరింది. వైఎస్సార్‌ కడప జిల్లా తర్వాత అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి 10 మంది డిశ్చార్జి అయ్యారు. మరోవైపు.. ఇప్పటివరకు కరోనా బారినపడి 14 మంది మరణించారు. ఆసుపత్రుల్లో 523 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన తీరు ప్రదర్శిస్తుండగా వాటిలో కూడా తెలుగు రాష్ట్రాల పని మరింత మెరుగ్గా ఉన్నట్లు ఒక జాతీయ చానల్ తాజాగా చేసిన విశ్లేషణ బట్టి తెలుస్తోంది. ప్రముఖ జాతీయ చానల్ టైమ్స్ నౌ శుక్రవారం విడుదల చేసిన ఈ విశ్లేషణలో ఏపీతోపాటు కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కరోనా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని విశ్లేషణలో పేర్కొంది. కరోనా ప్రభావాన్ని అదుపు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది. 

దేశంలో కరోనా వైరస్‌ కేసుల నమోదు మొదలైనప్పటి నుంచి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరు, నిర్వహిస్తున్న పరీక్షలు, కేసుల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ‘టైమ్స్‌ నౌ’ చానల్‌ విశ్లేషణ నిర్వహించింది. మే 14 నాటికి దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్యపై కూడా అంచనా వేసింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని ప్రముఖ జాతీయ ఛానల్‌ ‘టైమ్స్‌ నౌ’ విశ్లేషించింది. ఏపీ, కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో కేసుల పెరుగుదల తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటుండటమే అందుకు కారణమని పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో కేసుల పెరుగుదల అధికమై పరిస్థితి సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో మే 3 తర్వాత కేసులు తక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల పనితీరుపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల డబ్లింగ్‌ రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జాతీయ సగటు కంటే మెరుగైన రేటు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో మొత్తం 19 రాష్ట్రాలు ఉన్నాయి. లాక్‌ డౌన్‌ కంటే ముందు దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు (డబ్లింగ్‌) అయ్యేందుకు 3 రోజులు పట్టగా.. లాక్‌ డౌన్‌ అమలు చేశాక అది మెరుగైంది. గడిచిన వారం రోజుల్లో డబ్లింగ్‌ రేట్‌ 6.2 రోజులుగా ఉంది. జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో పటిష్ట నిరోధక చర్యలతో కేసుల సంఖ్య తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఏప్రిల్‌ 1 నుంచి కేసుల గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 1.2 గా ఉందని, అంతకుముందు రెండు వారాల్లో ఇది 2.1గా ఉందని తెలిపింది.

 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle