newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

రాష్ట్రంలో ఒక నీతి ... పరాయి రాష్ట్రానికి ఇంకో సూక్తి

27-02-201927-02-2019 13:07:36 IST
2019-02-27T07:37:36.894Z27-02-2019 2019-02-27T07:37:32.595Z - - 26-06-2019

రాష్ట్రంలో ఒక నీతి ... పరాయి రాష్ట్రానికి ఇంకో సూక్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు వ్యూహం సరైనదేనా? ఢిల్లీ స్థాయిలో కాంగ్రెసుతో పొత్తు... రాష్ట్రంలో మాత్రం ఎవరి దుకాణం వారిదే ! రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ అంటూ మొన్నమొన్నటిదాకా తిట్ల దండకాన్ని వినిపించిన బాబు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తన ఫోకస్ అంతా మోడీ, జగన్, కెసియార్‌ల మీద పెట్టి పనికానిచ్చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ మాత్రం సోదిలోలేని వాళ్ళందర్నీ పోగేసి బస్సు యాత్ర అంటూ కొత్త సర్కస్ మొదలుపెట్టింది. వాళ్ళ స్లోగన్ ఒకటే..‘‘మాకు అధికారమిస్తే మేము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం’’ఈ కామెడీ చూడలేక జనం ఛస్తున్నారు.

ఇక్కడ వీళ్ళతో కలిస్తే తనకు..తన పార్టీకీ నూకలు చెల్లిపోతాయన్నది బాబు లెక్క. అందుకే ఆయన ఈ అంటరానితనం సూత్రం పాటిస్తున్నారు. ఢిల్లీకి వెళ్తే మాత్రం డైరెక్టుగా రాహుల్ దర్శనానికి ఫస్ట్ ప్రయారిటీ. పైగా యూపీ దోస్తులైన మాయావతి, అఖిలేష్‌లను కాంగ్రెసుతో దోస్తీ చేయాలంటూ మంతనాలు. తన రాష్ట్రంలో ఒక నీతి.. పరాయి రాష్ట్రానికి ఇంకో  సూక్తి ! 

ఏపీలో ఇప్పటికే టికెట్ల వేడి రాజుకుంది. ఇతర పార్టీలతో పొత్తుల గురించి చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం లేదు. అసలు చంద్రబాబు పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహిస్తూ వాటి పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టడంతో టికెట్లు ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో జాతీయస్థాయిలోనే కలసి పనిచేస్తామని, రాష్ట్రంలో ఆ పార్టీతో ఎలాంటి ఎన్నికల అవగాహన ఉండదని ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలన్నిటినీ సంఘటితం చేస్తున్నామని చంద్రబాబు అంటున్నారు. అనేక సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని వార్తలు రావడంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. 

జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో నాలుగుశాతం టీడీపీకి ఆదరణ పెరిగిందని, తాము నిర్వహించిన సర్వేల్లో తమకు అనుకూల ఫలితాలు వస్తాయని ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించారు. సర్వేలు వేరు, వాస్తవం వేరని గ్రహించాలంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కంటే టీడీపీ ధీటుగా దూసుకెళ్తోందని చంద్రబాబు చెబుతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల వరకూ టీడీపీ ఒంటరిగా పోటీచేసినా, లోక్ సభ సంగతి ఏంటో అర్థం కావడం లేదంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు.

కాంగ్రెస్‌తో జాతీయస్థాయిలో పొత్తు అంటే లోక్ సభకు వర్తిస్తుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు వైఖరి టీడీపీ నేతలను అయోమయానికి గురిచేస్తోందన్నది మాత్రం వాస్తవం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle